Repalle: రేపల్లె ఘటన బాధితురాలికి నేడు హోం మంత్రి తానేటి వనిత పరామర్శ

ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణ అత్యాచారానికి గురైన మహిళకు.. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Repalle: రేపల్లె ఘటన బాధితురాలికి నేడు హోం మంత్రి తానేటి వనిత పరామర్శ

Taneti

Repalle: ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణ అత్యాచారానికి గురైన మహిళకు.. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితతో పాటు.. పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎస్సీ కమిషన్ ప్రతినిధులు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బాధితురాలిని పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read More: Woman Gang Rape : రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..భర్తను బెదిరించి అఘాయిత్యం

మరోవైపు.. నిన్న సాయంత్రం బాధితురాలిని బాపట్ల నుంచి ఒంగోలు రిమ్స్‌కు తరలించిన అనంతరం.. ఆస్పత్రి ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే స్వామిని పోలీసులు రిమ్స్ లోపలికి అనుమతించలేదు. ఆగ్రహంతో.. ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే స్వామి బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు, ఆయనకు వాగ్వాదం జరిగింది. కాసేపటికి.. ఆరోగ్య మంత్రి విడదల రజిని ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి.. సమీప రహదారులను పోలీసులు దిగ్బంధం చేశారు. అప్పటికీ ఎమ్మెల్యే స్వామి, అనుచరులు కలిసి రిమ్స్ గేట్లు తోసుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించే క్రమంలో.. ఎమ్మెల్యే స్వామి గాయపడ్డారు.

చివరికి.. ఎమ్మెల్యే స్వామితో పాటు.. టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి.. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపటికి బయటికి వచ్చిన ఎమ్మెల్యే. అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. రిమ్స్ వద్ద గొడవ సద్దుమణిగిన తర్వాత.. మంత్రి రజిని.. బాధితురాలిని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూడడం దారుణమని మీడియాతో అన్నారు.

Read More: Minister Vidadala Rajini: రేపల్లె ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి విడదల రజిని