×
Ad

చర్చిద్దాం రండి.. అటెండెన్స్‌ మ్యాటర్స్‌.. స్పీకర్‌ పిలుపు..! రైట్‌ టు రీకాల్‌ అంటూ వార్నింగ్

వైసీపీ ఏదో ఊహించుకుని సభకు దూరంగా ఉండటం సబబు కాదన్న ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి.

Ayyannapatrudu

  • ఏపీ చట్టసభల్లో ఇంట్రెస్టింగ్‌ సీన్
  • వార్‌ వన్‌సైడ్‌గా అన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు
  • సభ్యుల అటెండెన్స్‌పై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

Ayyannapatrudu: ఏపీలో అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. కానీ అక్కడ అలా..ఇక్కడ ఇలా అన్నట్లుగా ఉంది సీన్. మండలిలో తమకు బలం ఉంది కాబట్టి.. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతీ అంశంలో చర్చకు పట్టుబడుతోంది. కూటమిని నిలదీసే ప్రయత్నం చేస్తోంది.

అటు కూటమి కూడా వైసీపీ ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇస్తోంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సభకు హాజరై జవాబు ఇస్తూ అసలు సిసలు ప్రజాస్వామ్య వేదికగా..ప్రజా సమస్యల పరిష్కార నిలయంగా మండలి సెషన్‌ను నడుపుతున్నారు. ఇటు అసెంబ్లీకి వచ్చేసరికి కూటమి సభ్యులే సభకు హాజరు అవుతున్నారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం రోజే సభకు హాజరై..నిరసన తెలిపి వెళ్లిపోయారు.

దీంతో అటు శాసనసభ..ఇటు శాసనమండలి నడుస్తున్న తీరుపై ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మండలిలో వైసీపీ పోషిస్తున్న పాత్రపై సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు..అసెంబ్లీలో జగన్‌తో సహా వైసీపీ సభ్యులెవరూ అటెండ్ కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సభకు అటెండ్ అయితే కదా మాట్లాడే అవకాశం ఇస్తారో ఇవ్వరో తెలిసేది అన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ డిస్కషన్ జరగడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Also Read: Video: తీవ్ర ఉద్రిక్తత మధ్య బాల్క సుమన్‌ అరెస్ట్‌.. కోర్టుకు తరలించిన పోలీసులు

స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాత్రం ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఎప్పటికప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా జీతాలు తీసుకునే ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలంటూ కామెంట్‌ చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్‌లో..వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరును పరోక్షంగా ప్రస్తావిస్తూ స్పీకర్ విమర్శలు చేశారు.

గత బడ్జెట్ సెషన్‌ నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా, ఏ సమావేశమైనా సరే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలని..అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం సరికాదంటూ చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలను రీకాల్ చేసే పద్ధతి ఉండాలని అయ్యన్నపాత్రుడు బలంగా కోరుకుంటున్నారు.

8 దేశాల్లో చట్టసభ సభ్యులను రీకాల్ చేసే పద్ధతి!
ప్రపంచంలోని 8 దేశాల్లో చట్టసభ సభ్యులను రీకాల్ చేసే పద్ధతి ఉందంటున్న అయ్యన్నపాత్రుడు.. మన దేశంలో అలాంటి వ్యవస్థ లేకపోవడం బాధాకారం అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు ప్రతిపాదనలో రాజకీయమే ఎక్కువగా ఉన్నప్పటికీ పదేపదే ఆయన చేస్తున్న వాదనపై విస్తృత చర్చ జరుగుతోంది.

అసెంబ్లీలో ఏఐ అటెండెన్స్ ప్రవేశపెట్టిన తర్వాత సభ్యుల హాజరు బాగుందన్నారు స్పీకర్. సభ్యులు సభకు ఎప్పుడు వస్తున్నారో.? ఎప్పుడు వెళ్తున్నారో.? సభలో ఎంత సేపు ఉంటున్నారో.? స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. అయితే కూట‌మి ఎమ్మెల్యేల తీరుపై కూడా స్పీక‌ర్ ఆవేద‌న వ్యక్తం చేస్తున్నా రు. స‌భ‌కు వ‌చ్చి..ప‌ట్టుమ‌ని 10 నిమిషాలు కూడా కూర్చోకుండా..లాబీల్లో తిరుగుతున్నార‌ని..మీడియాతో చిట్ చాట్ పెట్టుకుంటున్నార‌ని అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు.

మండలిలో ప్రజా సమస్యలపై చర్చ
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయినా..మరెవరైనా వైసీపీ సభ్యులు సభకు హాజరు కావాలని కోరేది ప్రజా సమస్యలపై చర్చ జరగాలనే. నిజానికి మండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరుగుతోంది. అక్కడ వైసీపీ సభ్యులు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ హుందాగా సభ నడిచేలా బిహేవ్ చేస్తున్నారు.

వాడీ వేడీ చర్చలు..ఆర్గ్యుమెంట్లు..హాట్‌ హాట్ డిబేట్లు..వైసీపీ నిరసనలు..ఇలా అన్ని ఉన్నా మండలి మాత్రం అసలైన ప్రజాస్వామ్య వేదికను తలపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావాలనే వాదన పెరిగిపోతోంది. ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అన్న అంశం పక్కన పెట్టి..సమస్యలపై మాట్లాడే సమయం ఇస్తారా లేదా అన్నది సభకు హాజరై చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ చెబుతున్నట్లుగా మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే బాయ్‌కాట్‌ చేసి కూటమి సర్కార్ తీరును ఎక్స్‌పోజ్‌ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకానీ ముందే వైసీపీ ఏదో ఊహించుకుని సభకు దూరంగా ఉండటం సబబు కాదన్న ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. మండలిలాగా అసెంబ్లీలో కూడా వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందనేది అందరి వాదనగా మారింది. ఇంకా 15 రోజులు ఏపీ అసెంబ్లీ సెషన్‌ జరగనుంది. ఇప్పటికైనా జగన్‌తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని సభకు హాజరై..ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనడమే కాదు..కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నది పబ్లిక్ ఒపీనియన్‌గా కనిపిస్తోంది.