×
Ad

Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. అయినా జైల్లోనే

రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం. అటు పట్టాభిపురం పీఎస్ కేసులో కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది.

  • Published On : February 9, 2026 / 06:33 PM IST

Ambati Rambabu Representative Image (Image Credit To Original Source)

  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా అంబటి రాంబాబు
  • రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదు
  • పట్టాభిపురం పీఎస్ కేసులో కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్

 

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.

ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్ పడింది. నల్లపాడు పీఎస్ కు సంబంధించిన కేసులో మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ పై వైసీపీ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం కండిషన్ బెయిల్ ఇచ్చింది మొబైల్ కోర్టు. కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. అటు పట్టాభిపురం పీఎస్ కేసులో కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అంబటిని రాజమండ్రి జైలుకి తరలించారు.

Also Read: కేంద్ర క్యాబినెట్ బెర్త్ టీడీపీకా, జనసేనకా? చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది. పట్టాభిపురం పీఎస్‌లో నవంబర్ 12న అంబటి రాంబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అంటూ అప్పట్లోనే ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ క్రమంలో సోమవారం అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 22వరకు ఆయనకు రిమాండ్ విధించింది.