AP Telangana Rains: బంగాళాఖాతంలో మారుతున్న సీన్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు!
AP Telangana Rains Update: బంగాళాఖాతంలో అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడితే ఏపీ, తెలంగాణలో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Updated on- October 10, 2026 / 12:15 PM IST
Bay Of Bengal Low Pressure Rain Alert For Andhra Pradesh And Telangana
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారుతుందా?
- ఎండలకు బ్రేక్ పడనుందా? ఏపీ, తెలంగాణకు వానల అలర్ట్
- తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్
AP Telangana Rains : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాలకు బిగ్ గుడ్ న్యూస్.. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయింది. మళ్లీ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది బలపడితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం బలపడితే వాయుగుండం?
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత 3 నుంచి 4 రోజుల్లో మరింత బలపడవచ్చు. అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉంది.
కొన్ని వాతావరణ నమూనాలు బుధవారం నాటికి వాయుగుండంగా బలపడవచ్చని సూచిస్తున్నాయి. మరికొన్ని మాత్రం అల్పపీడనంగానే కొనసాగే అవకాశాన్ని సూచిస్తున్నాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది.
Read Also : Delhi High Alert : ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ నిరసనతో భారీ భద్రత.. మెట్రో స్టేషన్లు బంద్!
ఏపీకి వర్ష సూచన.. :
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు అధికారిక వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. సముద్రం అల్లకల్లోలంగా మారే పరిస్థితులు ఉంటే వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తెలంగాణలోనూ భారీ వర్షాలు :
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకోవచ్చు.
ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండొచ్చు. మొత్తంగా చూస్తే.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
