Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. నేటి నుంచే సర్వీసులు.. వారికి ఫ్రీ ప్రయాణం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram Airport) నేడు సోమవారం నుంచి అధికారికంగా వాణిజ్య సేవలను ప్రారంభించింది.
- V Santhosh Kumar
- Updated on- August 17, 2026 / 06:53 AM IST
Bhogapuram airport services will officially start from today
- నేటి నుంచే భోగాపురం సర్వీసులు
- తొలిరోజు ముప్పై ఒక్క విమానాలు
- రైతులకు ఉచిత విమానయానం
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రఖ్యాత జీఎంఆర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు సోమవారం నుంచి అధికారికంగా వాణిజ్య సేవలను ప్రారంభించింది. దీనితో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి జరిపే పౌర విమాన సర్వీసులు పూర్తిగా భోగాపురానికి బదిలీ అయ్యాయి. ఆదివారం రాత్రి ఢిల్లీ విమానంతో విశాఖలో పౌర విమాన సర్వీసులు ముగియగా, అర్ధరాత్రి దాటిన తర్వాత భోగాపురం రన్‌వేపై విమానాల ఇంజిన్లు గర్జించాయి. తొలి విమానంగా స్కూట్ ఎయిర్‌లైన్స్ సర్వీసు సింగపూర్‌కు బయలుదేరింది.
MCR TIMS Hospital: హైదరాబాద్‌లో మరో అతిపెద్ద హాస్పిటల్.. 1,000 పడకల టిమ్స్ ప్రారంభం నేడే
నేడు 31 విమానాల రాకపోకలు – ప్రయాణికులకు భారీ ఏర్పాట్లు:
ఈ ప్రారంభ రోజున భోగాపురం నుంచి మొత్తం 31 విమానాలు రాకపోకలు సాగించనుండగా, సుమారు 6 నుంచి 7 వేల మంది ప్రయాణించనున్నారు. ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చే ఇండిగో విమానానికి అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, ముంబయి, దిల్లీ, కోల్‌కతా నగరాలతో పాటు సింగపూర్, అబుధాబి వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. రద్దీకి తగినట్లుగా విశాఖ నుంచి భోగాపురానికి ప్రత్యేకంగా 20 విద్యుత్ బస్సులను కూడా నడుపుతున్నారు.
భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన యాన గౌరవం:
ఈ ప్రాజెక్ట్ కోసం(Bhogapuram Airport) తమ భూములు త్యాగం చేసిన 2,200 మంది రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పిస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి, తొలిరోజు తొలి విడతగా సుమారు 165 మంది రైతన్నలతో ఉచిత విమాన ప్రయాణం చేయించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మిగిలిన రైతులకు కూడా విడతల వారీగా ఈ అవకాశం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి తలమానికంగా నిలిచిన ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ప్రాంతీయ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
