Bhuma Akhila Priya: నీ ఇంటికొచ్చి మరీ తేలుస్తా.. ముదిరిన భూమా వర్సెస్ గంగుల వార్.. ఆళ్లగడ్డలో హైటెన్షన్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా(Bhuma Akhila Priya) వర్సెస్ గంగుల కుటుంబాల మధ్య నడుస్తున్న రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Bhuma Akhila Priya challenges to Gangula Brijendra Reddy

  • ఆళ్లగడ్డలో భూమా గంగుల యుద్ధం
  • ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే రాజీనామా
  • బహిరంగ చర్చకు అఖిలప్రియ సవాల్

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. భూమా వర్సెస్ గంగుల కుటుంబాల మధ్య నడుస్తున్న దశాబ్దాల రాజకీయ వైరం.. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ తలనీలాల వ్యవహారంతో మళ్లీ భగ్గుమంది. ఆలయ తలనీలాల టెండర్లు, నిధుల వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి మధ్య సవాల్ ప్రతిసవాల్‌లతో ఆళ్లగడ్డలో తీవ్ర పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది.

SSC Board: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. కరెక్షన్స్ కి ఇదే చివరి అవకాశం

కేవలం కమీషన్ల కోసమే భూమా కుటుంబీకులు అహోబిలం తలనీలాల రవాణాను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) ఘాటుగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఆమె గంగులకు బహిరంగ సవాల్ విసిరారు. అహోబిలంలో జరుగుతున్న వ్యవహారాలపై ఏ మీడియా సంస్థ ముందైనా, లేదా నేరుగా గంగుల ఇంటి దగ్గరికైనా వచ్చి బహిరంగ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.

ఒకవేళ గంగుల తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని అఖిలప్రియ ప్రకటించారు. అలా నిరూపించలేకపోతే గంగుల బ్రిజేందర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో అనుచరులు, కార్యకర్తలు భారీగా మోహరించే అవకాశం ఉండటంతో ఆళ్లగడ్డలో పోలీసులు అప్రమత్తమయ్యారు.