×
Ad

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

జోగి రమేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు నకిలీ లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరపనున్నారు.

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు ఎక్సైజ్ పోలీసులు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు కస్టడీ విచారణలో జనార్ధన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారు. అతడి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జోగి రమేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు నకిలీ లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరపనున్నారు.

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఇష్యూని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. నకిలీ మద్యం తయారీ వెనుకున్న వారిని వదిలేది లేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏ1గా జనార్దన్ రావు ఉన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా వైసీపీ కీలక నేత జోగి రమేశ్ కు మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఏ క్షణంలో అయినా జోగి రమేశ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ టర్న్.. తొలి రాజకీయ అరెస్ట్.. నెక్స్ట్ ఏం జరగబోతోంది?