Tirumala Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ టర్న్.. తొలి రాజకీయ అరెస్ట్.. నెక్స్ట్ ఏం జరగబోతోంది?
ఇక నుంచి ఈ కేసులో కీలక వ్యక్తుల విచారణలు..అరెస్ట్ లు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కేవలం అరెస్టయిన నిందితులకే పరిమితం కాకుండా, టీటీడీలోని కొందరు వ్యక్తుల ప్రమేయంపైనా..
 
                            
Tirumala Laddu Case: ఏడాది కింద ఆ ఇష్యూ ఏపీ పాలిటిక్స్ ను ఓ ఊపు ఊపేసింది. నేషనల్ టాపిక్ అయింది. శ్రీవారి చుట్టూ ఎంత కాంట్రవర్సీ అయిందో..అంతే స్థాయిలో వివాదం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పుడు మరోసారి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి ఇష్యూ తెరమీదకు వచ్చింది. స్పెషల్ సిట్ దర్యాప్తులో కీలక అప్ డేట్స్ తో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది కల్తీ నెయ్యి కేసు. ఓ కీలక నేత పీఏను సిట్ అరెస్ట్ చేయడం కీలక పరిణామంగా మారింది. కల్తీ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? నెక్స్ట్ ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు?
ఏపీనే కాదు..దేశాన్నే ఓ ఊపు ఊపేసిన తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ..ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ సిట్ దర్యాప్తును స్పీడప్ చేసింది. 4 టీమ్ లుగా ఏర్పడి..అన్నింటిపై చిక్కుముడి విప్పే పనిలో ఉన్న అధికారులు..కీలక అరెస్ట్ తో చర్చకు దారితీసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాల ఎపిసోడ్ అల్మోస్ట్ కంప్లీట్ అయిందని అంటున్నారు. ఇప్పుడు ఓవైపు విచారణలు ఎపిసోడ్ నడుస్తుండగా..ఇంకోవైపు అరెస్టులపై సిట్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఓ రకంగా దర్యాప్తు క్లైమాక్స్ కు చేరినట్లేనని అంటున్నారు.
ఈ కేసు ఎటు టర్న్ తీసుకుంటుందోనన్న ఉత్కంఠ..
ఇప్పుడు లేటెస్ట్ గా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..మాజీ పీఏ అప్పన్నను సిట్ అరెస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్ లోనే అప్పన్నను మూడు రోజుల పాటు స్పెషల్ సిట్ టీమ్ ప్రశ్నించినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులను కూడా సిట్ విచారించినట్లు ప్రచారం జరిగింది. ఇక తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు. అప్పన్నది తొలి రాజకీయ అరెస్ట్ కావడంతో..ఈ కేసు ఎటు టర్న్ తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇక కీలక వ్యక్తుల విచారణలు, అరెస్టులు?
2024 జూలైలో కల్తీ నెయ్యి కేసు మొదలైంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని..ఆ మాటకొస్తే అది నెయ్యే కాదని స్పెషల్ సిట్ కోర్టుకు ఇచ్చిన ఆధారాల్లో మెన్షన్ చేసింది. చిన్న అప్పన్న అరెస్టుతో తర్వాత నెక్స్ ఏం జరగబోతుందనేది టెన్షన్ క్రియేట్ చేస్తోంది. వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు బయలుదేరాయి. కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక నుంచి ఈ కేసులో కీలక వ్యక్తుల విచారణలు..అరెస్ట్ లు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. కేవలం అరెస్టయిన నిందితులకే పరిమితం కాకుండా, టీటీడీలోని కొందరు వ్యక్తుల ప్రమేయంపైనా సిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నెయ్యి సప్లై చేసిన సంస్థలకు ఆ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా..కొందరు టీటీడీ అధికారులు వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని అనుమానిస్తున్నారు.
ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంతా ఒక ఎత్తు అయితే..అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచడంతో పాటు అప్పన్న అరెస్ట్ తో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014లో వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి 2024 ఎన్నికలు ముగిసేవరకు ఆయన పీఏగా కొనసాగారట. ఢిల్లీలో సుబ్బారెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడమే కాదు.. జగన్ పాలనలో హస్తినలోని ఏపీ భవన్ లో ప్రొటోకాల్ ఓఎస్డీగానూ అప్పన్న బాధ్యతలు చూసేవారట. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడే ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న భోలేబాబా డెయిరీ నుంచి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా అయిందంటున్నారు.
నెయ్యి నాణ్యత సరిగా లేదని గుర్తించి ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. అయినా భోలే బాబా డైరెక్టర్లు ఏదో ఒక డెయిరీని ముందుపెట్టి తిరుమలకు నెయ్యి సప్లై చేసేవారట. అప్పటి టీటీడీ పెద్దలకు ఇదంతా తెలిసినా సైలెంట్ గా ఉండిపోయారన్న ఆరోపణలున్నాయి. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ డెయిరీకి కూడా ఉత్తరాఖండ్ లోని భోలేబాబా సంస్థే కల్తీ నెయ్యి పంపిందట. మధ్యవర్తిగా తిరుపతి జిల్లాలోని శ్రీ వైష్ణవి డెయిరీని వ్యవహరించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారించడం..ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
త్వరలో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డికి నోటీసులు?
త్వరలో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డితో పాటు అప్పటి ఈవో ధర్మారెడ్డిని విచారిస్తే కల్తీ నెయ్యి ఇష్యూలో కన్ఫ్యూజన్ అంతా వీడుతుందని సిట్ ఓ అంచనాకు వచ్చిందట. ఇప్పుడు సుబ్బారెడ్డి పీఏను అరెస్ట్ చేయడం అందులో భాగమేనని..త్వరలోనే అసలు సూత్రధారులుగా భావిస్తున్నవారికి నోటీసులు ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం..రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.






