Bird Flu Outbreak: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్లు మృతి.. అధికారుల సూచనలు
ఒక్క సదుం మండలంలోనే 20 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి.
- T Venkateshwarlu
- Published On : February 10, 2026 / 09:05 AM IST
Bird Flu
Bird Flu Outbreak: చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా సదుం మండలంలో బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ ఫాంలలోని వేలాది కోళ్లు మృతి చెందాయి. దీంతో మిగిలిన కోళ్లను అధికారులు చంపేయిస్తున్నారు.
మృతి చెందిన కోళ్లను సామూహికంగా ఖననం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ శాఖ అధికారులు పర్యటిస్తున్నారు.
బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ ఫాంలు ఖాళీ అవుతున్నాయి. సదుం, అమ్మగారి పల్లి, కంభంవారి పల్లి, పుట్టావాండ్లపల్లి గ్రామాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు అధికారులు. ఒక్క సదుం మండలంలోనే 20 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.
చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మండలంలోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పెద్ద ఎత్తున కోళ్లు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌కు శాంపిల్స్ పంపారు వెటర్నరీ అధికారులు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకదని చెప్పారు. 70°C నుంచి 100°C మధ్య ఉష్ణోగ్రత వద్ద చికెన్‌ను బాగా ఉడికించి తీసుకోవాలని సూచిస్తున్నారు.
