Sudheer Reddy (Image Credit To Original Source)
Sudheer Reddy: బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు చదిపిరాళ్ల సుధీర్ రెడ్డి మరోసారి మత్తుపదార్థాలు తీసుకుంటూ దొరికిపోయాడు. డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ శివారులోని నార్సింగిలో సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కాడు.
అతడిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడిని డీ అడిక్షన్ సెంటర్‌కు పంపారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
గతంలోనూ మత్తు పదార్థాలు తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరికాడు. ఈగల్ టీమ్ పోలీసులు ఇవాళ తనిఖీలు చేపట్టిన సమయంలో సుధీర్ రెడ్డి వారికి చిక్కాడు.