BJP National Secretary Satyakumar
Satyakumar Comments YCP Government : స్కిల్ డెవలప్మెంట్ కేసులానే బైజూస్ లో వైసీపీ ప్రభుత్వ అవినీతి కూడా బయటకు వస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. బైజూస్ లో అవినీతిపై బీజేపీ ఆధారాలు సేకరిస్తుందని త్వరలోనే కేసులు పెడతామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో వ్యవహరించిన తీరును బీజేపీ ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు బెయిల్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని కోర్టు పరిధిలోని అంశమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంలో రాష్ట్ర అంశాలపై జోక్యం చేసుకోలేదన్నారు.
రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి విస్మరించి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. 15 రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజల దృష్టి మరల్చుతున్నారని వెల్లడించారు. సీఎం కక్ష్య సాధింపులపై పెడుతున్న దృష్టి వ్యవసాయం, రైతాంగం సమస్యలపై పెట్టడం లేదని విమర్శించారు.
Malkajgiri: ఆపరేషన్ మల్కాజిగిరి.. మైనంపల్లికి చెక్ చెప్పేలా దీటైన నేత కోసం బీఆర్‌ఎస్ అన్వేషణ
పాలన గాలికి వదిలేయడంతో పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఏడు సార్లు కరెంట్ చార్జీలు పెంచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో నిత్యావసరాల ధరలు ఉన్నాయని చెప్పారు. ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ జనాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ ను అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజుతో పోల్చారు. ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్రంలో ప్రతి రోజు పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా పురందేశ్వరిని విమర్శించడం సరైంది కాదన్నారు. పొత్తులపై ఇప్పుడేమీ చెప్పలేమని జనవరిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.