Boat Capsize: పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు చిన్నారులు బలి

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా(Boat Capsize) పడటంతో పలువురు నీటిలో మునిగిపోయారు.

Boat overturns in krishna river near konuru three killed in accident

  • కృష్ణా నదిలో పడవ బోల్తా ప్రమాదం
  • ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు
  • ఆరుగురిని కాపాడిన స్థానిక గ్రామస్థులు

Boat Capsize: పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోనూరు గ్రామ సమీపంలో కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడటంతో పలువురు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్‌ (12), చైతన్య (28) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Gnaneswari Missing Case: జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ‘హనుమాన్ టీం’.. థర్మల్ డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్.. తునిలో ఉత్కంఠ

సమాచారం ప్రకారం, ఒక కుటుంబానికి చెందిన 10 మంది బంధువులు కోనూరులో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యేందుకు పడవలో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా కృష్ణా నదిలో పడవ అదుపుతప్పి బోల్తా(Boat Capsize) పడింది. దీంతో పడవలో ఉన్న వారంతా ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

గ్రామస్థుల సాయంతో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే గల్లంతైన నలుగురిలో ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం. మరొకరి కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.