Amaravati-Hyderabad Bullet Train : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే న్యూస్.. అమరావతి టూ హైదరాబాద్ 70 నిమిషాలే జర్నీ.. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది..
Amaravati To Hyderabad Bullet Train : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దీంతో 70 నిమిషాల్లోనే అమరావతి టూ హైదరాబాద్ చేరుకోవచ్చునని తెలిపారు.
- Harish Thanniru
- Updated on- April 29, 2026 / 10:30 AM IST
Bullet Train From Amaravati To Hyderabad in 70 Minutes
- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
- అమరావతి నుంచి హైదరాబాద్‌కు హైస్పీడ్ బుల్లెట్ రైల్
- కేవలం 70 నిమిషాలే ప్రయాణం
Amaravati-Hyderabad Bullet Train : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే న్యూస్. హైదరాబాద్ టూ అమరావతికి.. అమరావతి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేయాలంటే ప్రస్తుతం రోడ్డు, రైలు మార్గం ద్వారా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. అయితే, రాబోయే కాలంలో కేవలం 70 నిమిషాల్లోనే హైదరాబాద్ టూ అమరావతికి చేరుకోవచ్చు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దీంతో 70 నిమిషాల్లోనే అమరావతి టూ హైదరాబాద్ చేరుకోవచ్చునని తెలిపారు.
Also Read : ఏపీలో టెన్త్ ఫలితాలపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన.. ఫలితాలకోసం ఇక్కడ చెక్ చేసుకోండి..
విశాఖపట్టణంలో జరిగిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణలో కీలక ముందడుగు వేయబోతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే హైదరాబాద్ నుంచి అమరావతి ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు పరిమితం అవుతుందని పేర్కొన్నారు. అమరావతి నుంచి చెన్నైకు కేవలం 112 నిమిషాల్లో చేరుకునేలా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల్లో చేరుకునేలా హైస్పీడ్ రైలు సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
దక్షిణాది రాష్ట్రాలకు బుల్లెట్ రైళ్ల కనెక్టివిటీ భవిష్యత్తులో లభించనుందని, దీనివల్ల పారిశ్రామికంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందడటమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని, రైల్వే నిధులు విడుదల చేశామని అన్నారు. ఏపీకి రూ.10వేల కోట్లకుపైగా నిధులు విడుదల చేశామని, విశాఖ కేంద్రం కొత్త రైల్వే జోన్ అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను జూన్ 1 నుంచి నోటిపై చేస్తామని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెవేర్చుతున్నామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదన్న ఆయన.. రైల్వేలు, పోర్టులు, హైవేల ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంచేస్తున్నాయని, అన్ని రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
