AP 10th Results 2026 : ఏపీలో టెన్త్ ఫలితాలపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన.. ఫలితాలకోసం ఇక్కడ చెక్ చేసుకోండి..
AP 10th Results 2026 : ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు.
AP 10th Results 2026
AP 10th Results 2026 : ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. గురువారం (ఏప్రిల్30)న ఫలితాలు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికేపూర్తి చేసింది.
టెన్త్ విద్యార్థులు వారి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌తో results.bse.ap.gov.in, https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ఏపీలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో 6.30లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఫలితాలకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి మే 3 లేదా 4తేదీల్లో టెన్త్ ఫరీక్షల ఫలితాలు విడుదల అవుతాయని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తి కావడంతో గురువారం ఫలితాల విడుదలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏపీ ప్రభుత్వం మార్కులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఏడాది ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థుల ఆన్సర్ షీట్లు వాల్యూషన్ చేసిన తరువాత మార్కులను కౌంట్ చేసిన పేపర్ రికార్డుల్లో నమోదు చేయడంతోపాటుగా ట్యాబ్‌లలో కూడా వెంటనే అప్లోడ్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా, LEAP మొబైల్ యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకుని.. హాల్ టికెట్ నంబర్ పంపితే మార్కుల వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి.
