AP Bus Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. 14మంది సజీవదహనం..
AP Bus Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
- Harishth Thanniru
- Published On : March 26, 2026 / 07:11 AM IST
Bus accident in ap
- ఏపీలో ఘోర బస్సు ప్రమాదం
- మార్కాపురం జిల్లా రాయవరంలో ఘటన
- టిప్పర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
- మంటలు చెలరేగడంతో 10మంది సజీవదహనం
AP Bus Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న 14మంది సజీవదహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లడంతో 23మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తుండగా.. రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. చీమకుర్తి నుంచి కంకర లోడుతో టిప్పర్ వెళ్తుంది. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో బస్సులోని డీజిల్ ట్యాంక్ పగిలి క్షణాల్లోనే మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మంటలు రెండు వాహనాలకు వ్యాపించడంతో రెండు వాహనాలు దగ్దమయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా నమోదైందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బస్సు కిటికీ అద్దాలను పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, పలువురికి తీవ్రగాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మృతుల్లో కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.
