లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వాహానదారుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను వాటి యజమానులు తీసుకువెళ్లవచ్చని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారనే ఆరోపణలతో పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వాటి యజమానులు వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు సంబంధిత పోలీసు స్టేషన్ లో సమర్పించి వాహనాలను తిరిగి తీసుకోవచ్చని ఆయన పేర్కోన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు డీజీపీ వివరించారు.
Read: రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు : డీజీపీ గౌతం సవాంగ్