AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది.. అభ్యర్థులు నెక్స్ట్ చేయాల్సింది ఇదే.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా విడుదలైంది. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది.. అభ్యర్థులు నెక్స్ట్ చేయాల్సింది ఇదే.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

AP Mega DSC 2025

Updated On : August 23, 2025 / 7:24 AM IST

AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా విడుదలైంది. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ నుంచి మాత్రమే సమాచారం పొందాలని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: AP New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజన.. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలేవి? కూటమి ప్రభుత్వం లక్ష్యమేంటి?

అభ్యర్థులు ఇలా చేయాలి..

వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కన్వీనర్ ఓ ప్రకటనలో సూచించారు. వెరిఫికేషన్ కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును డీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికె సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా అధికార బృందాలు..

జిల్లాల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. 50మంది అభ్యర్థులకు ఒక బృందం ఉంటుంది. కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రెవెన్యూ, దివ్యాంగ సర్టిఫికెట్ల పరిశీలనకు వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన సోమవారం నుంచి చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ఒకేసారి మొత్తం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయనున్నారు. అయితే, ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలు వచ్చి ఏదైనా ఒక్క పోస్టును ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత అభ్యర్థిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు.

స్టేట్ టాపర్లు వీరే..

ప్రిన్సిపాల్ పోస్టుల్లో : చింతల గౌతమ్ (75.5 స్కోరు), జి. రాజశేఖర్ (73)
పీజీటీలో సబ్జెక్టుల వారీగా : పట్నాన ధర్మారావు (85.5 తెలుగు), వారణాసి లక్ష్మీస్వరూప (87, ఇంగ్లీష్), రమేశ్ రామనుకొలను (93.5, హిందీ), తునికిపాటి భాను (94, సంస్కృతం).
ఇంగ్లీష్ మాధ్యమంలో : చౌడవరం శివకుమార్ (81.5, జీవశాస్త్ర), విజయ్ (78.5 గణితం), కూరాకుల బాలకిశోర్ (74.5, భౌతికశాస్త్రం), కురమాన నిరోషా (85, సాంఘీక శాస్త్రం).
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ (టీజీటీ)లో : రమ్యశ్రీ వెలగల (85.43, ఇంగ్లీష్), పవన్ నారాయణ్, కౌశిక్ శాస్త్రి (88.53, హిందీ), తునికిపాటి భాను (93.60 సంస్కృతం), కల్లె మహేశ్ బాబు (85.20, తెలుగు).
ఇంగ్లీష్ మాధ్యమంలో : సుంకరణం విజయ్ (87.33, గణితం), బి. అనిత (77.89, సామాన్యశాస్త్రం), బొమ్మిడి దిల్లేష్ (84.20, సాంఘీక శాస్త్రం).
వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల్లో : వ్యాయామ ఉపాధ్యాయ రాష్ట్ర స్థాయి పోస్టుల్లో అన్నెపు జగదీశ్వర రావు 90.5 స్కోర్ తో స్టేట్ ఫైస్ట్ ర్యాంకర్ గా నిలిచారు.

రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా 3లక్షల 36వేల 307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90శాతం హాజరయ్యారు. తాజాగా ప్రభుత్వం మెరిట్ జాబితాను విడుదల చేసింది.