Kadapa: ఆ ముగ్గురిలో కడపకు “సైకిల్” బాస్ అయ్యేదెవరు? హైకమాండ్ ప్లాన్ ఏంటి?
మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు భూపేష్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేనట్లుగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజార్టీతో ఓటమిపాలైయ్యారు.

Who Will Be the Next TDP District President in Kadapa ve
Kadapa: ఆ జిల్లాలో మూడు దశాబ్దాల చరిత్రకు ముగింపు పలికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అక్కడ తమకు ఓట్లు పడటమే కష్టమన్న స్టేజ్ నుంచి జిల్లాను శాసించే సీట్ల దాకా చేరింది టీడీపీ పార్టీ. ఇదే తరహాలో కడప జిల్లాపై మరింత పట్టు సాధించేందుకు బిగ్ స్కెచ్‌తో దూసుకెళ్తోంది సైకిల్ పార్టీ. 2024 ఎన్నికల్లో కడప ఎమ్మెల్యే సీటులో విజయం టీడీపీలో ఎక్కడా లేని ఆనందాన్ని నింపింది.
ఆ తర్వాత మహానాడుతో జగన్ కంచుకోట కడపలో పసుపు పండుగ హోరెత్తింది. ఇక పులివెందుల, ఒంటిమిట్ట బైలెక్షన్స్‌లో గెలిచి సత్తా చాటారు తెలుగు తమ్ముళ్లు. ఈ నేపథ్యంలో కడప జిల్లాపై సీఎం చంద్రబాబు స్పెషల్ కాన్సంట్రేషన్ చేశారట. జిల్లాకు కొత్త అధ్యక్షుడ్ని నియమించే పనిలో ఉన్నారు. అందుకోసం ఏకంగా త్రిమెన్ కమిటీ వేశారు. స్ట్రాంగ్ లీడర్ జిల్లా పార్టీ బాస్‌గా పెట్టాలని హైకమాండ్ భావిస్తోందట.
జిల్లా అధ్యక్ష పదవి అంటే పార్టీ ఎవరినో ఒకరి పేరును అనౌన్స్ చేయడం కామన్. కానీ కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి అనే సరికే అటెన్షన్ మారిపోతోంది. ఆశావహులు ఎక్కువే ఉన్నారు. అధిష్టానం ఆలోచనలు కూడా బలంగా ఉన్నాయి. దీంతో గట్టి లీడర్‌ను జిల్లా అధ్యక్షుడిగా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
క్యాబినెట్ ర్యాంకు పోస్ట్ అన్నంత అంచనాలు
అయితే కడప జిల్లా అధ్యక్ష పదవి అంటే ఇప్పుడు టీడీపీలో క్యాబినెట్ ర్యాంకు పోస్ట్ అన్నంత అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే కడప జిల్లాపై బాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జిల్లా పార్టీ యాక్టివిటీని నడిపించే నాయకుడు..డైరెక్ట్ అధినేతతో టచ్‌తో ఉండే అవకాశం ఉంటుంది. పైగా కావాల్సిన ఎలివేషన్ వస్తుంది.
అందులోనూ మాజీ సీఎం జగన్ జిల్లా కావడంతో మిగతా జిల్లాల కంటే కడప జిల్లా అధ్యక్ష పదవి సమ్‌థింగ్ స్పెషల్‌గానే భావిస్తున్నారు లీడర్లు. (Kadapa)
ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతోన్న శ్రీనివాసులురెడ్డి పేరు..మరోసారి కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ప్రచారంలో ఉంది. అయితే ఆయన ఇప్పటికే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఒకే వ్యక్తికి జోడు పదవులు ఉండొద్దన్న మంత్రి లోకేశ్ పెట్టిన రూల్‌తో శ్రీనివాసులురెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. దీంతో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు అలాగే పొలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న శ్రీనివాసులు రెడ్డి ఒక పదవి వదులుకోవాల్సి ఉంటుంది.
జిల్లా అధ్యక్ష రేసులో భూపేష్ రెడ్డి పేరు
పొలిట్ బ్యూరో ద్వారా నేరుగా పార్టీ పెద్దలతో సంబంధాలు కొనసాగించవచ్చు కాబట్టి శ్రీనివాసులురెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలను వదులుకుంటారని అంటున్నారు. ఆయన పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్‌గా ఉండేందుకే ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. దీంతో కొత్త అధ్యక్ష ఎంపిక ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి పేరు జిల్లా అధ్యక్ష రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే లాస్ట్ మూమెంట్‌లో ప్రొద్దుటూరు టికెట్ కోల్పోయిన ఉక్కు ప్రవీణ్ పేరు కూడా జిల్లా అధ్యక్ష పదవి పరిశీలనలో ఉన్నట్టు టాక్.
మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు భూపేష్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేనట్లుగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజార్టీతో ఓటమిపాలైయ్యారు. దీంతో ఆయనకు కడప జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కడప పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల్లో బంధు వర్గం అంతకు మించి అందరితో కలిసిపోవడం, గతంలో ఎంపీగా పోటీ చేయడం భూపేష్‌కు కలిసొచ్చే అంశాలు.
అంతేకాకుండా రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు స్టార్ట్ చేయడం, జిల్లాపై మరింత పట్టు సాధించి ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉక్కు ప్రవీణ్‌రెడ్డి కూడా బలాబలాలు బానే ఉన్నాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.