Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డీఎస్సీ క్రీడా కోటా వివాదం ధర్నాకు దిగిన అంబటి రాంబాబు(Ambati Rambabu)పై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

cases booked against ysrcp leader ambati rambabu vijayawada saap protest

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డీఎస్సీ క్రీడా కోటా వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద నిరసన, ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. అనుమతి లేకుండా విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)ను కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ధర్నాకు దిగిన అంబటి రాంబాబుతో పాటు మరొక 15 మంది నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

Adilabad RIMS Tragedy: ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. SNCUలో షార్ట్ సర్క్యూట్.. 27 మంది శిశువులకు గాయాలు, పసికందు మృతి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు:

విజయవాడ శాప్ కార్యాలయ ముట్టడి ఘటనకు సంబంధించి సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై కేసులు జులై అయ్యాయి. శాప్ డైరెక్టర్, ఓ డీఎస్సీ అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మాచవరం పోలీసులు బీఎన్‌ఎస్ (BNS) చట్టంలోని కీలక సెక్షన్లతో పాటు తీవ్రమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. నూరి ఫాతిమా, డైమండ్ బాబు, అంబటి మురళీకృష్ణ, సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

250 మందిపై కేసు.. కొనసాగుతున్న ముమ్మర గాలింపు:

శాప్ ఆందోళనలో పాల్గొన్న సుధీర్ భార్గవ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు నరసరావుపేటలోని ఆయన నివాసానికి వెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించారు. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిరసన ర్యాలీ నిర్వహించారంటూ సూర్యారావుపేట ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏకంగా 250 మంది వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులపై కేసు నమోదు చేశారు.