పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు కేంద్రం అంగీకారం

  • Publish Date - November 3, 2020 / 12:48 AM IST

Polavaram project arrears : పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సోమవారం (నవంబర్ 2, 2020) కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఎలాంటి షరుతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు అంగీకరించింది.



రూ.2,234.28 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు మెమో పంపింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తి చేయాలని జలశక్తి శాఖను ఆదేశించింది.



పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గతంలో హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం చేసిన ఖర్చును ధ్రువీకరిస్తూ కాగ్‌ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు