AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్ ఎఫెక్ట్.. రెండ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో వానలేవానలు.. పండుగవేళ వాతావరణ శాఖ కీలక సూచనలు

AP Rain : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో శని, ఆదివారాల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Rains : బంగాళాఖాతంలో తుఫాన్ ఎఫెక్ట్.. రెండ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో వానలేవానలు.. పండుగవేళ వాతావరణ శాఖ కీలక సూచనలు

AP Rain

Updated On : January 10, 2026 / 6:54 AM IST
  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • ఇవాళ మధ్యాహ్నం సమయంలో తీరందాటే అవకాశం
  • శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

AP Rains : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలను చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఉదయం 9గంటల వరకు చలి వణికిస్తుంది. దీంతో ఉదయాన్నే కార్యాలయాలు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. భారత వాతావరణ శాఖ (IMD) వివరాల ప్రకారం..

AP Rain

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఇవాళ (శనివారం) మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీరందాటనుంది. మొదట్లో తుఫాన్‌గా బలపడుతుందని భావించినా.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో బలపడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.

AP Rain

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలో శని, ఆదివారాల్లో వర్షాల కురుస్తాయని పేర్కొంది. శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతోపాటు.. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేసింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

AP Rain

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పు తీరంలోని అన్ని పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాన్ని చలి వణికిస్తోంది. ప్రస్తుతం వర్షాల కారణంగా చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.