Sankranti 2026 Date: సంక్రాంతి ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..

పలు కారణాల వల్ల ఈ సారి సంక్రాంతి తేదీల విషయంలో గందరగోళం నెలకొంది.

Sankranti 2026 Date: సంక్రాంతి ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..

Sankranti 2026 Date (Image Credit To Original Source)

Updated On : January 10, 2026 / 5:02 PM IST
  • సంక్రాంతి జనవరి 14న అని ప్రచారం
  • తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 15నే
  • భోగి జనవరి 14న, కనుమ 16న 

Sankranti 2026 Date: తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగ సందడిలో ఉన్నారు. హైదరాబాద్‌లో పనిచేసేవారు సొంతూళ్లకు వెళ్తున్నారు. సంక్రాంతి పండుగ తేదీ గురించి కొంతమందిలో తికమక ఉంది.

సంక్రాంతి జనవరి 14న అని చాలా మంది భావిస్తున్నారు. అయితే, తెలుగు పంచాంగం ప్రకారం సంక్రాంతి జనవరి 15నే అని పండితులు చెబుతున్నారు. అలాగే, భోగి జనవరి 14న, కనుమ జనవరి 16న ఉంది. కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమను జనవరి 17న జరుపుకుంటారు.

Also Read: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. దూసుకొచ్చిన కారు.. రోడ్డుపై నిలబడ్డవారంతా వణికిపోతూ..

ధనస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వేళ ఏ రోజు ఉంటుందో అదే రోజున కొన్ని ప్రాంతాల వారు మకర సంక్రాంతి జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల వారేమో ఆ తర్వాతి రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

ఆయా కారణాల వల్ల ఈ సారి సంక్రాంతి తేదీల విషయంలో గందరగోళం నెలకొంది. తెలుగు పంచాంగంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు పంచాంగాలు ఉన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి జనవరి 14న, మరికొన్ని ప్రాంతాల్లో 15న జరుపుకుంటున్నారు.

కాగా, భానుడు గత గత నెల 16న ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఈ నెల 14 రాత్రి 8.43 గంటలకు మకర రాశిలోకి రానున్నాడు. దీంతో ఆ రోజు రాత్రి మకర సంక్రాంతి వేళలు ఉన్నట్లు లెక్క. తెలుగు రాష్ట్రాల్లోని వారు పండుగలకు సూర్యోదయ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.