ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. దూసుకొచ్చిన కారు.. రోడ్డుపై నిలబడ్డవారంతా వణికిపోతూ..

బెంగళూరులోని ఇందిరానగర్ "100 ఫీట్ రోడ్డు"లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. స్కోడా మోడల్ కారును డెరిక్ టోనీ (42) అనే వ్యక్తి నడిపాడు.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. దూసుకొచ్చిన కారు.. రోడ్డుపై నిలబడ్డవారంతా వణికిపోతూ..

Drunken Drive

Updated On : January 10, 2026 / 3:36 PM IST
  • బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఘటన
  • బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ గోడను ఢీకొట్టిన కారు
  • ఒక ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

Video: మద్యం మత్తులో ఓ డ్రైవర్ కారును నడిపించాడు. కారును ఎక్కడికి, ఎలా తీసుకెళ్తున్నాడో అతడికే అర్థం కాలేదు. ఆ కారు ఒక్కసారిగా డివైడర్‌ను సైతం దాటేసి రెస్టారెంట్ గోడను ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న వారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ కారు రావడాన్ని ఒక్క క్షణం ఆలస్యంగా గమనించినా రోడ్డుపై ఉన్న వారి ప్రాణాలు పోయేవి.

ఈ ఘటన బెంగళూరులోని ఇందిరానగర్ “100 ఫీట్ రోడ్డు”లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. స్కోడా మోడల్ కారును డెరిక్ టోనీ (42) అనే వ్యక్తి నడిపాడు. ప్రమాద సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Also Read: IAS Officers Row: ఇలా అభాండాలు వేయడం కరెక్ట్ కాదు.. రిపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్..: మంత్రి కోమటిరెడ్డి

కారును టోనీ ఎడమ మలుపు వద్ద సరిగ్గా తిప్పలేక నేరుగా డివైడర్ వైపు వెళ్లాడు. కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆపై బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొంది.

డిన్నర్ పూర్తిచేసిన కొందరు హోటల్ బయట నిలబడి ఉన్నారు. వారంతా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. ఓ ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతడి పేరును జాబిర్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.