LPG Gas OTP: ఏపీలో ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. OTP లేకుండానే డెలివరీ.. కీలక నిబంధన సడలింపు!
అర్నబ్ తుఫాను నేపథ్యంలో ఏపీలోని 13 జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల(LPG Gas OTP) డెలివరీకి ఓటీపీ నిబంధన నుంచి తాత్కాలిక మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Updated on- November 8, 2026 / 11:25 AM IST
Centre waives off otp rule for lpg gas cylinder delivery in ap arnab cyclone affected
LPG Gas OTP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికించిన ‘అర్నబ్’ తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల పలు జిల్లాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ విపత్తు కారణంగా విద్యుత్ వ్యవస్థలు చిన్నభిన్నమై, మొబైల్ టవర్లు పనిచేయక కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. ఈ క్లిష్ట సమయంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వంట గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చించి, ఎల్పీజీ గ్యాస్ (LPG Gas OTP)సిలిండర్ డెలివరీకి ఉన్న ‘ఓటీపీ’ నిబంధన నుంచి తాత్కాలిక మినహాయింపు ఇప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
13 జిల్లాల్లో అమల్లోకి వెసులుబాటు.. నెట్‌వర్క్ సమస్యలకు చెక్:
సాధారణంగా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ నమోదు తప్పనిసరి. అయితే నెట్‌వర్క్ లేక వినియోగదారులు సిలిండర్లు తీసుకోలేకపోతున్న క్షేత్రస్థాయి పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తక్షణమే స్పందించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలతో సహా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న మొత్తం 13 జిల్లాల్లో ఓటీపీ ధృవీకరణ లేకపోయినా నేరుగా నగదు చెల్లించి గ్యాస్ పొందేలా గ్యాస్ పంపిణీ సంస్థలు చర్యలు చేపట్టాయి.
కమ్యూనికేషన్ పునరుద్ధరణ వరకు సడలింపు.. నిరంతరాయంగా పంపిణీ:
బాధితుల ఇళ్లలో సాధారణ పరిస్థితులు నెలకొని, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ వ్యవస్థలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడే వరకు ఈ తాత్కాలిక మినహాయింపు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్, సిగ్నల్స్ లేని సమయంలోనూ వంట గ్యాస్ సకాలంలో అందుతుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మిగిలిన సాధారణ జిల్లాల్లో మాత్రం ఎప్పటిలాగే ఓటీపీ ప్రక్రియ ద్వారానే గ్యాస్ డెలివరీ సాగుతుందని స్పష్టం చేశారు.
