AP Cabinet Meeting: సోషల్ మీడియా ఫేక్ న్యూస్‌పై ఫైర్.. మంత్రులకు కీలక ఆదేశాలు.. కేబినెట్ మీటింగ్ లో సీఎం వార్నింగ్
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ (AP Cabinet Meeting)సమావేశం ముగిసింది.
- V Santhosh Kumar
- Updated on- September 23, 2026 / 04:04 PM IST
Chandrababu comments on local body elections and Jagan criticism at AP Cabinet meeting.
AP Cabinet Meeting: అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting)ముగిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, వర్షాల ప్రభావం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతిభద్రతల అంశాలపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. సీఎం చంద్రబాబు మంత్రులకు పలు కీలక దిశానిర్దేశాలు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
Beef In Hostel: హాస్టల్ మెనూలో బీఫ్? తమిళనాడులో రాజకీయ దుమారం.. ప్రభుత్వం సంచలన వివరణ!
స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి.. కూటమి విజయంపై ధీమా:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఎన్నికల కమిషన్ త్వరలోనే తేదీలను ప్రకటిస్తుందని సీఎం తెలిపారు. స్థానిక సమరాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను నియోజకవర్గ ఇన్‌చార్జ్ మంత్రులే వహించాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడాలని పిలుపునిచ్చారు.
వైకాపా కుట్రలు, సోషల్ మీడియా దుష్ప్రచారాలపై ఫైర్:
సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న అవాస్తవాలను, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న అసాంఘిక శక్తులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వైకాపా రౌడీ మూకల ద్వారా రాష్ట్రంలో అలజడి రేపేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Banks Open Sunday: ఆదివారం తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్రం, ఆర్‌బీఐ కీలక నిర్ణయం
శాంతిభద్రతల ఉల్లంఘనపై ఉక్కుపాదం.. కఠిన చట్టాలు:
వైసీపీ అధినేత జగన్ బెంగళూరులో కూర్చొని రిమోట్ కంట్రోల్ ద్వారా ఏపీలో రౌడీ గ్యాంగ్‌లతో అరాచకాలు చేయిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై రైల్వే చట్టాల తరహాలోని కఠినమైన చట్టాలను తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామని తేల్చిచెప్పారు.
