Chandrababu : టీడీపీ లీడర్లకు చంద్రబాబు గట్టి వార్నింగ్
మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొందరు నేతలు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
- kunduru Vinod
- Published On : November 26, 2021 / 11:13 PM IST
Chandrababu (4)
Chandrababu : మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో.. మాట్లాడుతూ కొందరు నేతలు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత దూకుడుగా వెళ్లాలని తీర్మానించింది.
చదవండి : CM Jagan on Chandrababu: చంద్రబాబు ‘సంస్కారానికి’ నా ‘నమస్కారం’!
అధికారపార్టీ చేస్తున్న తప్పులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లారని పార్టీ నాయకులకు సూచించారు బాబు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఆత్మగౌరవ సభలు జరుపాలని కూడా టీడీపీ నిర్ణయించింది. పార్టీకోసం కష్టపడే వారికి అన్యాయం చేయమని, షో చేసే వారిని ఇక పక్కకు పెడతామని స్పష్టం చేశారు. కొందరు నేతలు పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం లేదని మండిపడ్డారు బాబు.
చదవండి : Chandrababu Naidu : జగన్ లాంటి వారి గురించి అంబేద్కర్ ఆనాడే ఆలోచించారు – చంద్రబాబు
రాజకీయాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవని.. మారిన రాజకీయాలకు అనుగుణంగా మనం కూడా మారాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలపై దాడులు జరుగుతుంటే.. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తేనే మనం ముందుకు వెళ్లగలమని చంద్రబాబు తెలిపారు.
