lokesh, chandrababu
TDP: పవర్‌లోకి వచ్చి ఆల్రెడీ ఇరవై నెలలు అవుతుంది. ఇప్పటిదాకా అభివృద్ధి, సంక్షేమంపైనే ఫుల్ ఫోకస్ నడిచింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయ్. ఇప్పుడు పార్టీపై కాన్సన్‌ట్రేషన్ షిప్ట్ చేశారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే అపాయింట్‌మెంట్ కోరి తమను కలవాలనుకునే బదులు.. చంద్రబాబే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలు ఏంటి.?
ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి ఒపీనియన్ ఉంది.? స్థానికంగా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేశారా.? మీకేం కావాలి.? పార్టీ పరంగా ఏం చేయాలి.? ప్రభుత్వ పరంగా చేసి పెట్టాల్సిన పనులు ఏంటి.? మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా.? అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు..తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వలేదనే విమర్శలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారట. అసలే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నడుస్తుంది.
ఎమ్మెల్యేలంతా 9 గంటల వరకు సభలో ఉండాలని ఇప్పటికే బాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు విజయవాడలోనే ఉండే అవకాశం ఉంది. దీంతో ఇదే సమయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుసగా భేటీ అవుతూ..ఎక్కడిక్కడ సమస్యలకు చెక్ పెట్టి.. అంతా సెట్ చేసే ప్లాన్ చేస్తున్నారట.
అటు మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిన్నర్ మీట్ అవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకూ ఈ భేటీలు జరగనున్నాయి. రోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులతో నారా లోకేశ్ డిన్నర్ భేటీలు కంటిన్యూ కాబోతున్నాయి. నారా లోకేష్‌తో జరిగే ఈ డిన్నర్ మీట్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా వారి కుటుంబసభ్యులు కూడా హాజరవుతున్నారు.
ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడే అవకాశం
ఈ విందు సమావేశాల్లో నియోజకవర్గాల్లోని సమస్యలపై చర్చించడంతో పాటు..ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని నారా లోకేశ్ భావిస్తున్నారు. ఇలా అటు సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులకు డైరెక్షన్స్ ఇస్తూ..ఫ్యూచర్ పాలిటిక్స్‌పై దిశానిర్దేశం చేస్తున్నారట. లోకేశ్ అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బాండింగ్ పెంచుకునేలా..కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చేస్తుంటే..ఎక్కడా అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
గత ప్రభుత్వ హయాంలో సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా గగ్గోలు పెట్టినట్లు కథనాలొచ్చాయి. పైగా తమ హయాంలో సీఎంవో నడపాల్సినంత గొప్పగా నడపలేకపోయామని వైసీపీ నేతలే చెప్తుంటారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనే ఆవేదనతో కొంతమంది ఎమ్మెల్యేలు కక్కలేక, మింగలేక మిన్నకుండిపోయి ఎన్నికల తర్వాత బరస్ట్ అయిపోయారు.
అభిప్రాయాలను లోతుగా తెలుసుకునే అవకాశం
మరికొందరు అయితే ముందు నుంచే ఆఫ్ ది రికార్డ్‌లో తమ ఆగ్రహాన్ని, ఫ్రస్ట్రేషన్‌ను వెళ్లగక్కిన సందర్భాలున్నాయి. అయితే తమ పార్టీలో, ప్రభుత్వంలో పరిస్థితికి తావు లేకుండా అటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి లోకేశ్ సరికొత్త ఆలోచన చేశారని తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అయినా పూర్తిగా కొన్ని గంటలు వ్యక్తిగతంగా, మరికొంత సమయం వారి కుటుంబ సభ్యులతోనూ కలిసినట్లు ఉండటంతో పాటు.. వారి నియోజకవర్గాల్లో సమస్యలు, పార్టీ పరిస్థితి, ప్రజల అభిప్రాయాలను లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.
ఈ అసెంబ్లీ సెషన్ పూర్తయ్యేలోపు డిన్నర్ విత్ లోకేశ్ కార్యక్రమం వైరల్‌గా మారే ఛాన్స్ ఉంది. అలా అని లోకేశ్ ప్రత్యేకత ఈ ఒక్క కార్యక్రమానికే పరిమితం కాదని..మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి “ఎక్స్” వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపైనా వెంటనే స్పందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
ఎక్స్‌లో తన దృష్టికి వచ్చిన సమస్యను..తన ఆఫీస్ టీమ్‌కు అసైన్ చేస్తున్నారు.. వారు ఫాలో అప్ చేసి, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు డిన్నర్ మీట్‌తో నేరుగా సమావేశం అయి..గ్రూప్‌వార్..కమ్యూనికేషన్ గ్యాప్‌కు చెక్ పెట్టి..అక్కడక్కడ ఏమైనా అసంతృప్తులు, అలకలు ఉన్నా అంతా సెట్‌రైట్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.