AP Cabinet : చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రులు వీరే.. జనసేన నుంచి పవన్‌తో సహా ముగ్గురికి చోటు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
- Harishth Thanniru
- Published On : June 12, 2024 / 07:15 AM IST
AP Cabinet
Chandrababu Naidu Cabinet 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ తో సహా మొత్తం 24మంది మంత్రుల జాబితాను విడుదల చేశారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఈ జాబితాలో జనసేన పార్టీకి మూడు , బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. సామాజిక వర్గాల వారిగా క్యాబినెట్ లో చోటు కల్పించారు. జనసేన నుంచి కేబినెట్ లో పవన్ కల్యాన్ , నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ చోటు దక్కించుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ ఒక్కరికే అవకాశం దక్కింది.
Also Read : ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి?
ఏపీ కేబినెట్
1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి)
2. కొణిదెల పవన్ కళ్యాణ్
3. కింజరాపు అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్
6. పి.నారాయణ
7. వంగలపూడి అనిత
8. సత్యకుమార్ యాదవ్
9. నిమ్మల రామానాయుడు
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారధి
15. డోలా బాలవీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవి
17. కందుల దుర్గేష్
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్థన్ రెడ్డి
20. టీజీ భరత్
21. ఎస్.సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
25. నారా లోకేశ్
