Google AI Data Center : ఏపీలో కీలక పరిణామం.. గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన.. కేవలం రెండేళ్లలో

Google AI Data Center : ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారు.

chandrababu naidu lay foundation stone for google ai data center in visakhapatnam

  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్
  • శంకుస్థాపన చేసి సీఎం చంద్రబాబు
  • 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

Google AI Data Center : ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ లతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ 2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గూగుల్‌ రాక కేవలం విశాఖకు మాత్రమే కాక.. ఏపీకి ఒక గేమ్‌ ఛేంజర్‌. ఏపీ చరిత్రలో నేడు మరిచిపోలేని రోజన్నారు. ఏపీ టెక్నాలజీకి, భారత్కు ఏఐ డేటా సెంటర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని ఏపీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, ఆసియాలో అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో నిర్మించబోతున్నామని ఏపీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి గూగుల్ రావడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు.

గూగుల్ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.  మొత్తం రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో మూడు చోట్ల వీటిని ఏర్పాటు చేయబోతుంది. 2028నాటికి మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయించుకుంది. ముందుగా తర్లువాడలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాల భూమిని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేటాయించింది. గూగుల్‌ ఏఐ హబ్‌తో 1.88 లక్షల ఉద్యోగావకాశాలు రానున్నాయి. నిర్మాణ దశలోనే సుమారు 60 వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉందంటున్నారు.