×
Ad

కల్తీ లడ్డూ వ్యవహారంలో కుట్రదారుల్ని శిక్షించేందుకు చర్యలు.. పవన్, సత్యకుమార్‌తో చంద్రబాబు భేటీ

శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయటాన్ని తీవ్రమైన నేరంగా తాము పరిగణిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.

Satyakumar Yadav, Chandrababu Naidu, Pawan Kalyan (Image Credit To Original Source)

  • ప్రభుత్వం దీన్ని రాజకీయ కోణంలో చూడట్లేదు
  • భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది
  • కుట్రదారుల నిగ్గు తేల్చేందుకే కమిషన్: చంద్రబాబు

Tirumala Laddu Issue: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశానికి ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, లోకేశ్‌తో సీఎం చంద్రబాబు నాయుడు విడిగా సమావేశమయ్యారు. తిరుమల కల్తీ లడ్డూ విషయాన్ని ప్రభుత్వం రాజకీయ కోణం చూడట్లేదని స్పష్టం చేశారు.

తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడి తీరాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు అన్నారు. కుట్రదారుల నిగ్గు తేల్చేందుకే విచారణ కమిషన్ ఏర్పాటని తెలిపారు.

Also Read: కమిటీ ముందు విచారణకు హాజరైన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. మీడియాతో ఏమన్నారంటే?

శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయటాన్ని తీవ్రమైన నేరంగా తాము పరిగణిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. కుట్రదారుల్ని శిక్షించేందుకు తీసుకునే చర్యల్లో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందని చంద్రబాబుకు పవన్ స్పష్టం చేశారు.

బీజేపీ నుంచి తామూ అదే ఏకాభిప్రాయంతో ఉన్నామని సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వాస్తవాలను ప్రజల్లో పెట్టి వైసీపీ కుట్రల్ని ఐక్యంగా తిప్పికొడదామని సత్యకుమార్ యాదవ్ అన్నారు.