Tollywood Mega Meeting
Tollywood Mega Meeting Live Updates: టాలీవుడ్ కు ఇవాళ బిగ్ టర్నింగ్ డే. సినిమా టికెట్ల ధరలతో పాటు.. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న మరిన్ని ఇతర సమస్యలపై.. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసింది. ఇరు వర్గాల మధ్య కీలక భేటీ జరిగింది. చిరంజీవితో పాటు.. మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి, నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఇతర ప్రముఖులు జగన్ ను కలిశారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. హైదరాబాద్ లో స్పందించారు. తమ కుటుంబం నుంచి చిరంజీవి వెళ్తున్నారు కాబట్టి.. తాను హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. అన్ని విషయాలు చిరంజీవి మాట్లాడతరాని అన్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నుంచి గన్నవరానికి చిరంజీవి టీమ్