Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. అధికారులకు పవన్ వార్నింగ్.. కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 13 ఏనుగులు కలిగిన గుంపులోని ఒక మగ ఏనుగు (Elephant Death)అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.

Chittoor punganur male elephant died deputy cm pawan kalyan orders inquiry

  • విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి
  • అటవీశాఖ అధికారుల సమగ్ర దర్యాప్తు
  • పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

Elephant Death: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరు, మంగళంపేట అటవీ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాపిరెడ్డిగారిపల్లె సమీపంలో 13 ఏనుగులు కలిగిన గుంపు సంచరిస్తుండగా, అందులోని ఒక మగ ఏనుగు(Elephant Death) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పొలాల్లోని బోర్‌వెల్ మోటార్‌ విద్యుత్ తీగలు తగలడంతోనే విద్యుత్ షాక్‌కు గురై ఏనుగు మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక

సమగ్ర విచారణకు అటవీశాఖ ఆదేశాలు:

ఈ దారుణ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిర్దేశిత ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ మృత ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అటవీ వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో భద్రతా లోపాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి:

ఏనుగు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అటవీ శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అటవీ సరిహద్దుల్లో వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాలలో విద్యుత్ తీగల విషయంలో కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పటిష్టం చేయాలని సూచించారు.