Sri Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్‌లో బిగ్ ట్విస్ట్.. సిఐ మిత్రుడు సురేష్ అరెస్ట్.. శవాన్ని మాయం చేసేందుకు భారీ స్కెచ్

ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ(Sri Krishna Death Case) లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత వేగవంతం చేసింది.

CI Nagaraju friend Suresh is in police custody in connection with Sri Krishna death

  • సీఐ మిత్రుడు సురేష్ అదుపులోకి.
  • శవాన్ని మాయం చేసిన వ్యవహారం.
  • బాధితుడి కుటుంబంతో రాయబారాల గుర్తింపు.

Sri Krishna Death Case: ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) నాగరాజు అత్యంత ఆప్తుడు, మిత్రుడైన సురేష్‌ను సిట్ అధికారులు తాజాగా తమ అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ మరణం తర్వాత చోటుచేసుకున్న అనేక కీలక పరిణామాలలో సురేష్ పాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడంతో, ఈ అరెస్ట్ కేసు విచారణలో పెద్ద మలుపుగా మారింది.

Egg Price Hike: కొండెక్కిన కోడిగుడ్డు ధర.. ట్రే ధర ఎంతో తెలిస్తే షాకవుతారు?

సాయికృష్ణ(Sri Krishna Death Case) లాకప్ డెత్‌కు గురైన అనంతరం, మృతదేహాన్ని మాయం చేసే వ్యవహారంలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. లాకప్ డెత్ జరిగిన వెంటనే సిఐ నాగరాజుకు అన్ని రకాలుగా సురేష్ సహకరించినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, పోలీసుల అధికారిక విధుల్లో సురేష్ ఏ విధంగా జోక్యం చేసుకున్నాడు? అలాగే సిఐ నాగరాజుతో అతనికి ఉన్న ఆర్థిక, వ్యక్తిగత సంబంధాలు ఏమిటనే కోణంలో సైతం సిట్ అధికారులు ప్రస్తుతం సురేష్‌ను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, సాయికృష్ణ మరణవార్త బయటకు రాకుండా ఉండేందుకు, బాధితుడి కుటుంబ సభ్యులతో సురేష్ జరిపిన రాయబారాలపై కూడా సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కేసును అణచివేయడానికి, కుటుంబ సభ్యులను లోబరుచుకోవడానికి సురేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనే విషయాలను రాబడుతున్నారు. ఈ లాకప్ డెత్ మిస్టరీని పూర్తిగా ఛేదించడంలో సురేష్ ఇచ్చిన సమాచారం అత్యంత కీలకం కానుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.