CBN Birthday : సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని మోదీ, పవన్, జగన్, షర్మిల సహా..

CBN Birthday : టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

CBN 76th Birthday

CBN Birthday : టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సీఎం చంద్రబాబుకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వానికి రైల్వేశాఖ కీలక ప్రతిపాదన

సీఎం చంద్రబాబు జన్మదినం వేళ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే ఏపీ సీఎం.. తన మంచి మిత్రుడుగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని.. ఆయన మరింత ఆరోగ్యంగా ప్రజాసేవలో కొనసాగాలని మోదీ ఆకాంక్షించారు.


ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనకున్న విస్తారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు తన దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప బాధ్యతను స్వీకరించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వంటి లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడం ద్వారా, ఆయన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు. “సుపరిపాలన” అనే నినాదాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.


సీఎం చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన దీర్ఘాయువుతో జీవించాలని ఆకాంక్షించారు.


ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చంద్రబాబు నాయుడు‌కు ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్సు.. ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.