AP TDP District Presidents list
AP TDP District Presidents list : టీడీపీ అధిష్టానం ఏపీలోని జిల్లాల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. లోక్ సభ నియోజకవర్గం (జిల్లా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లను సీఎం చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లను ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల్లో ఓసీ నుంచి 11 మంది, బీసీ సామాజిక వర్గంకు చెందిన వారు ఎనిమిది మంది, ఎస్సీలు నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు, మైనార్టీ నుంచి ఒకరు ఉన్నారు.