Land Bass Book: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రేపే అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లె(Land Bass Book) నియోజకవర్గంలో రేపు పర్యటించనున్నారు.
- V Santhosh Kumar
- Published on- July 8, 2026 / 09:53 PM IST
CM Chandrababu Naidu banaganapalli, nandyal tour schedule and details
- రేపే చంద్రబాబు బనగానపల్లె పర్యటన
- రైతన్నలతో సీఎం ముఖాముఖి కార్యక్రమం
- అర్హులకు పాస్ పుస్తకాల పంపిణీ
Land Bass Book: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రేపు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటన కోసం నంద్యాల జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ బనగానపల్లెలో భారీ బందోబస్తుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేతలు కూడా ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Mamata Banerjee: కంట్రోల్ తప్పిన మమతా బెనర్జీ.. కార్యకర్త చెంప చెల్లుమనిపించింది
షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుండి ఉదయం 11:40 గంటలకు నేరుగా బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాల(Land Bass Book)ను స్వయంగా పంపిణీ చేయనున్నారు.
ఈ ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:35 గంటలకు బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంతర్గత సమావేశం ముగిసిన అనంతరం, సాయంత్రం 4:20 గంటలకు బనగానపల్లె నుండి తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు బయల్దేరుతారు.
