Jagan & CBN: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే వేదికపైకి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు

వచ్చే నెల 5న ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకోనున్నారు.

Jagan & CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతటి వేడి వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య వ్యక్తిగత వైరం తారా స్థాయికి చేరింది. ఒకరి ముందు ఇంకొకరి పేరు తీస్తేనే ఆగ్రహంతో రిగిలిపోయే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇరు నేతలను ఒకే వేదికపైన ఊహించగలమా? అయితే ఇది తొందరలోనే నిజం కాబోతోంది.

వచ్చే నెల 5న ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకోనున్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో ప్రధానితో ఇటీవల చంద్రబాబు భేటీ కాగా.. ఈనెల 12న విశాఖ పర్యటనలో ప్రధానితో కలిసి ఒకే వేదికపై కనిపించారు సీఎం జగన్. ఇక ఢిల్లీలో జరిగే సమావేశంలో ప్రధానితో వేదికను జగన్, చంద్రబాబు పంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IT Raids In Malla Reddy : మాకు ఐటీ దాడులు కొత్తకాదు .. 30ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంలో మూడుసార్లు జరిగాయి : మల్లారెడ్డి అల్లుడు మర్రి మర్రిరాజశేఖర్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు