IT Raids In Malla Reddy : మాకు ఐటీ దాడులు కొత్తకాదు .. 30ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంలో మూడుసార్లు జరిగాయి : మల్లారెడ్డి అల్లుడు మర్రి మర్రిరాజశేఖర్ రెడ్డి

మాకు ఐటీ దాడులు కొత్తకాదు.. 30ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంలో మూడుసార్లు జరిగాయి అన్నారు మల్లారెడ్డి అల్లుడు మర్రి మర్రిరాజశేఖర్ రెడ్డి.

IT Raids In Malla Reddy : మాకు ఐటీ దాడులు కొత్తకాదు .. 30ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంలో మూడుసార్లు జరిగాయి : మల్లారెడ్డి అల్లుడు మర్రి మర్రిరాజశేఖర్ రెడ్డి

Minister Malla Reddy's son-in-law's reaction on IT Raids

IT Raids In Malla Reddy : మంత్రి మల్లారెడ్డి నివాసాలతో పాటు ఆయన కుమారులు, అల్లుడు, బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇండియాలో లేరు. టర్కీలో ఉన్నారు. మీడియా ద్వారా ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆయన సమాచారం అందిన వెంటనే టర్కీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఐటీ దాడుల గురించి ఆయన మాట్లాడుతూ..మీడియా ద్వారానే నాకు ఐటీ దాడులు విషయం తెలిసిందని 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం..మాకు ఐటీ దాడులు ఏమీ కొత్తకాదు…ఇప్పటి వరకు మూడు సార్లు జరిగాయి. ఇది పెద్ద విషయం కాదు అని అన్నారు. కానీ ఈ ఐటీ దాడుల్లో ఎంత నగదు సీజ్ చేశారు అనే విషయం నాకు పూర్తిగా సమాచారం లేదని ఇక పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు తమ నవాసాల్ ఐటీ దాడులు జరిగాయని..పార్టీ మారాలని ఒత్తిడి చేయటానికే ఇదంతా చేస్తున్నారని తాను భావిస్తున్నానని అన్నారు.టర్కీ నుంచి హైద్రాబాద్ కు చేరుకున్న ఆయన తన నివాసంలో గురువారం (నవంబర్ 24,2022) ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు. .రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు నిర్వహించారని అన్నారు. తన నివాసంలో దాదాపు రూ. 4 కోట్లు సీజ్ చేసినట్లుగా సమాచారం ఉందన్నారు. కాలేజీల్లో వేతనాలకు నెలకు కనీసం కోటి రూపాయాలకుపైగా చెల్లిస్తున్నామని తెలిపారు.

ఐటీ సోదాలను తాము తప్పు పట్టటంలేదని అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. తాముమ చట్టప్రకారంగా ట్యాక్సులు చెల్లిస్తామని..కానీ తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని చెప్పారు. తన తండ్రి, తల్లి, కూతురితోపాటు ఇతరుల ఫోన్లను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారని ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

Malla Reddy: బీజేపీ కుట్రలో భాగంగానే మాపై దాడులు.. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మంత్రి మల్లారెడ్డి

2 రోజులు.. సుమారు 40 గంటలు.. 65 టీమ్స్‌.. 400 మంది అధికారులు.. పదిన్నర కోట్లు సీజ్‌.. ఇదీ అంకెల్లో మల్లారెడ్డి టార్గెట్‌గా సాగిన ఐటీ సోదాల సారాంశం. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సాగిన ఐటీ సోదాలు ఎట్టకేలకు ముగిశాయి. సోదాలతో అయిపోలేదని.. విచారణకు రావాలంటూ మల్లారెడ్డి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కు నోటీసులిచ్చింది ఐటీ. మంత్రి మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి.. వియ్యంకుడు లక్ష్మారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఇన్‌కంటాక్స్‌ ఆఫీసర్లు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాల సమాచారం. ఈ తనిఖీల తర్వాత ఐటీ అధికారులు పంచనామాపై సంతకాలు తీసుకునేందుకు మూడు గంటల పాటూ అక్కడే ఉన్నారని సమాచారం. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లిన కుమారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకునే ప్రయత్నం చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.

IT Raids On Malla Reddy : ఐటీ,ఈడీ దాడులు అనగానే గుండె నొప్పి వస్తుందా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఆ తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారిలో రత్నాకర్ అనే అధికారిని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రత్నాకర్‌ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత ఐటీ అధికారులు పీఎస్‌కు వెళ్లారు. మల్లారెడ్డిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా కొద్దిసేపు అక్కడ హైడ్రామా కనిపించగా.. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఇటు మంత్రి మల్లారెడ్డితో పాటూ బంధువుల ఇళ్లలో సోదాలు ముగిసినా..ఇవి పూర్తి కాలేదని సమాచారం.

ఐటీ అధికారుల తీరుపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. తమ దగ్గర ఎలాంటి డబ్బులు దొరకలేదని.. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా పుకార్లు పుట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎప్పటి నుంచో ఈ ఐటీ సోదాలను చూస్తున్నానని.. కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదన్నారు. ఐటీ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపించారు.. తమను చిత్రహింసలకు గురి చేశారన్నారు. తమకు సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించి అన్నీ సరిగ్గానే ఉన్నాయన్నారు.

IT Raids In Malla Reddy House : రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మల్లారెడ్డి ఇంటికొచ్చిన ఐటీ అధికారులు .. పక్కా స్కెచ్‌తో దాడులు

ఐటీ అధికారులకు కాలేజీలు, ఆస్పత్రులు, మిగిలిన ఆస్తుల వివరాలు అందించామన్నారు. ఐటీ అధికారులకు సహకరించామని.. అన్ని అనుమతులతోనే కళాశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నామని స్పష్టంచేశారు. మొత్తం మీద తెలంగాణలో ఐటీ దాడులు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.