Malla Reddy: బీజేపీ కుట్రలో భాగంగానే మాపై దాడులు.. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మంత్రి మల్లారెడ్డి

ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనతోపాటు, తన కుటుంబ సభ్యులపై ఐటీ శాఖ దాడులకు పాల్పడిందని ఆరోపించారు మల్లారెడ్డి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తమను ముందే హెచ్చరించాడని మల్లారెడ్డి అన్నారు.

Malla Reddy: బీజేపీ కుట్రలో భాగంగానే మాపై దాడులు.. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు: మంత్రి మల్లారెడ్డి

Malla Reddy

Malla Reddy: బీజేపీ కుట్రలో భాగంగానే ఐటీ శాఖ తనతోపాటు, కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడిందని ఆరోపించారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకే తనపై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Elon Musk: రోజురోజుకూ తగ్గిపోతున్న ఎలన్ మస్క్ సంపద.. ట్విట్టరే కారణమా?

గత రెండు రోజులుగా మల్లారెడ్డితోపాటు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇండ్లపై ఐటీ శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై మల్లారెడ్డి గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ కుట్రలో భాగంగానే మాపై ఈ దాడులు జరిగాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకే సోదాలు చేశారు. గత రెండు రోజుల నుంచి 65 బృందాలతో నాపై, కుటుంబ సభ్యులపై ఐటీ శాఖ సోదాలు చేసింది. బీజేపీ కుట్ర పన్నుతుందని సీఎం కేసీఆర్ ముందే మాకు ధైర్యం చెప్పారు. నన్ను స్మగ్లర్‌లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులను రెండు రోజులపాటు ఇబ్బంది పెట్టారు. ఈ దాడుల్లో రూ.28 లక్షలు మాత్రమే దొరికాయి. ఐటీ అధికారులు నన్ను నమ్మించి మోసం చేశారు. నా కొడుకుతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు.

Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్ వ్యాధి.. నెల రోజుల్లో 13 మంది మృతి

నా మనవరాలు ఫోన్ చెయ్యడంతో నేను నా కొడుకు దగ్గరకు వెళ్లాను. ఐటీ అధికారులు తీరుపై నేను ఫిర్యాదు చేశా. పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి పాలు, పూలు అమ్మాను. వ్యవసాయం చేసుకుంటూ బతికాను. విద్యా సంస్థలు పెట్టి పేదవాళ్లకు విద్యనందిస్తున్నా. మా కాలేజీలో ఎంబీఏ ఫీజు రూ.35 వేలు మాత్రమే తీసుకుంటున్నాను. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నా. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు చదువు అందిస్తున్నా. ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థను తీసుకొచ్చింది నేనే. నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఎలాంటి అక్రమాలు చెయ్యడం లేదు. అంతా చట్టబద్దంగా నడిపిస్తున్నాం. ప్రతి కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరి నుంచి క్లర్క్ వరకు ప్రతి ఒక్కరినీ సోదాలు చేసి విచారించారు.

ఐటీ సోదాలు నాకేం కొత్త కాదు. గతంలో కూడా జరిగాయి. 1994, 2008లో కూడా ఐటీ దాడులు జరిగాయి. మెడికల్ కాలేజీలో సీట్ల కొనుగోలు అంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది. కాలేజీలో 150 సీట్లు ఉంటే, అందులో 65 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా ఇస్తున్నాం. ఉచితంగా రోజూ వెయ్యి మందికి భోజనాలు అందిస్తున్నాం’’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.