Elon Musk: రోజురోజుకూ తగ్గిపోతున్న ఎలన్ మస్క్ సంపద.. ట్విట్టరే కారణమా?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ సంపద రోజురోజుకూ తరిగిపోతుంది. సగటున ప్రతి రోజూ రూ.2,500 కోట్ల సంపద తగ్గిపోతున్నట్లు అంచనా. టెస్లా షేర్లు పడిపోవడం, ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోవడం వంటివి దీనికి కారణాలు.

Elon Musk: రోజురోజుకూ తగ్గిపోతున్న ఎలన్ మస్క్ సంపద.. ట్విట్టరే కారణమా?

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ఎలన్ మస్క్ ఇటీవలి కాలంలో వరుసగా తన సంపద కోల్పోతున్నాడు. ఈ ఏడాది ఎలన్ మస్క్ సంపద 101 బిలియన్ డాలర్లు తగ్గిపోయిందని తాజా నివేదిక ఒకటి తేల్చింది. దీనికి ప్రధాన కారణం ట్విట్టరే అంటున్నారు విశ్లేషకులు.

Hijab Row: హిజాబ్ ధరించి కొందరు పరీక్ష రాస్తున్నారని.. కాషాయ కండువాలతో వచ్చిన మరికొందరు విద్యార్థులు

ఎలన్ మస్క్ సంపదకు ప్రధాన కారణం టెస్లా కంపెనీ. ఈ సంస్థ షేర్లు లాభాల్లో ఉండటంతో మస్క్ సంపద భారీగా పెరిగింది. ఏడాది క్రితం ఆయన సంపద దాదాపు 340 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఈ సంపద ఇప్పుడు తరుగుతూ వస్తోంది. ఇటీవల ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థ కోసం మస్క్ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడు. కొంతకాలంగా టెస్లాపై దృష్టి సారించడం లేదు. ఈ కారణంగా టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. రెండేళ్లుగా ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ఈ ఏడాదిలో ఆయన దాదాపు 101 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు అంచనా. అలాగే టెస్లాకు చెందిన దాదాపు 30,000 కార్లను కంపెనీ వెనక్కు తీసుకుంది. సాంకేతిక లోపాల కారణంగా కార్లను వెనక్కు తీసుకుంది. ఇది కూడా కంపెనీకి నష్టాలు మిగిల్చింది.

అలాగే టెస్లాకు అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో మూడేళ్లుగా కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇది కూడా కంపెనీ కార్ల విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్ల తయారీ ముడి సరుకు ధరలు పెరగడం, ఇతర కారణాల వల్ల కూడా కంపెనీ నష్టాల బాట పట్టింది. అలాగే ట్విట్టర్ సంస్థకు కూడా ఆదాయం పెరగడం లేదు. దీంతో ఎలన్ మస్క్ సంపద ప్రతిరోజూ సగటున రూ.2,500 కోట్లు నష్టపోతున్నట్లు అంచనా. కొంతకాలం తర్వాత ట్విట్టర్ సంస్థకు కొత్త సీఈవోను నియమిస్తానని, ఆ తర్వాత టెస్లాతోపాట మిగతా కంపెనీల బాధ్యతలు చూస్తానని మస్క్ చెప్పాడు. మస్క్ తిరిగి టెస్లాపై దృష్టి పెడితే కంపెనీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.