Hijab Row: హిజాబ్ ధరించి కొందరు పరీక్ష రాస్తున్నారని.. కాషాయ కండువాలతో వచ్చిన మరికొందరు విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారని, మరికొందరు విద్యార్థులు అందుకు పోటీగా కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ చెలరేగకుండా పోలీసులు మోహరించారు. విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన వస్త్రధారణలో వచ్చి కలకలం రేపడంతో చివరకు పరీక్షను వాయిదా వేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో చోటుచేసుకుంది.

Hijab Row: హిజాబ్ ధరించి కొందరు పరీక్ష రాస్తున్నారని.. కాషాయ కండువాలతో వచ్చిన మరికొందరు విద్యార్థులు

Protest Against Hijab: ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారని, మరికొందరు విద్యార్థులు అందుకు పోటీగా కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ చెలరేగకుండా పోలీసులు మోహరించారు. విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన వస్త్రధారణలో వచ్చి కలకలం రేపడంతో చివరకు పరీక్షను వాయిదా వేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో చోటుచేసుకుంది.

దాదాపు ఐదుగురు విద్యార్థులు కాషాయ కండువా ధరించి బడిలోకి వచ్చి 12వ తరగతి ప్రీ-బోర్డు పరీక్ష రాయాలనుకున్నారని ధులాగోర్ ఆదర్శ విద్యాలయ సిబ్బంది చెప్పారు. నిన్న జరిగిన పరీక్షకు ఐదుగురు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చి, రాశారని తాము కూడా కాషాయ కండువా ధరించి పరీక్ష రాస్తామని వారు డిమాండ్ చేశారని అన్నారు.

దీంతో ప్రతి ఒక్కరు స్కూల్ యూనిఫాంలోనే రావాలని విద్యార్థులందరికీ పాఠశాల అధికారులు సూచించారని చెప్పారు. పరీక్షను వాయిదా వేసినప్పటికీ విద్యార్థులు పాఠశాల గేటు వద్ద నుంచి వెళ్లకపోవడంతో పోలీసులను పిలిపించామని, చివరకు విద్యార్థులు ఇంటికి వెళ్లారని చెప్పారు. అనంతరం విద్యార్థులందరి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించామని తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..