IT Raids In Malla Reddy House : రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మల్లారెడ్డి ఇంటికొచ్చిన ఐటీ అధికారులు .. పక్కా స్కెచ్‌తో దాడులు

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో దాడులకు ఐటీ అధికారులు పక్కా స్కెచ్ ప్రకారమే చేశారా? ముందుగానే ప్లాన్ వేసి దాడులకు దిగారా? అంటే నిజమేననిపిస్తోంది. సాధారణంగా ఐటీ అధికారులు ఎవరి ఇళ్లలో అయినా సోదాలు నిర్వహించాలంటే ఎటువంటి సమాచారం లేకుండా హఠాత్తుగా వచ్చి తనిఖీలు నిర్వహిస్తారు. కానీ మల్లా రెడ్డి ఇంట్లో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లుగా తెలుస్తోంది.

IT Raids In Malla Reddy House : రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మల్లారెడ్డి ఇంటికొచ్చిన ఐటీ అధికారులు .. పక్కా స్కెచ్‌తో దాడులు

Raids of IT officers on Minister Mallareddy's residences with a clear plan

IT Raids In Malla Reddy House : మంత్రి మల్లారెడ్డి ఇంట్లో దాడులకు ఐటీ అధికారులు పక్కా స్కెచ్ ప్రకారమే చేశారా? ముందుగానే ప్లాన్ వేసి దాడులకు దిగారా? అంటే నిజమేనంటున్నారు ఐటీ అధికారులు. సాధారణంగా ఐటీ అధికారులు ఎవరి ఇళ్లలో అయినా సోదాలు నిర్వహించాలంటే ఎటువంటి సమాచారం లేకుండా హఠాత్తుగా వచ్చి తనిఖీలు నిర్వహిస్తారు. కానీ మల్లా రెడ్డి ఇంట్లో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లుగా పక్కాగా తెలుస్తోంది. ఎందుకంటే రెండు రోజుల నుండి మల్లారెడ్డి నివాసాల్లోను..కార్యాలయాల్లోను దాడులు కొనసాగిస్తున్న అధికారులు దాని కోసం ప్లాన్ వేశారు.

ఎలాగంటే రెండు రోజుల క్రితం ఐటీ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మంత్రి మల్లారెడ్డి ఇంటికి వచ్చారు. మా వద్ద భూములున్నాయి..మాకు డబ్బులు చాలా అవసరం..మీరు భూములు కొంటారా? అంటూ నేరుగా మల్లారెడ్డి ఇంటికొచ్చి మరీ అడిగారు. దీనికి మల్లారెడ్డి నేను భూములు కొనటంలేదని సమాధానం చెప్పారు. దీంతో కామ్ గా తిరిగి వెళ్లిపోయిన ఐటీ అధికారులు మరునాడే మల్లారెడ్డి నివాసాలు..కార్యాలయాలపై దాడులు చేపట్టారు. రెండో రోజు కూడా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మల్లారెడ్డి బంధువులు, ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లకు చెందిన 300ల బ్యాంక్ అకౌంట్లను ఐటీ అధికారులు పరిశీలించారు.మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలోనూ రూ.2 కోట్లు సీజ్ చేశారు.

IT Raids In Malla Reddy House: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ సోదాలు.. పెద్ద కుమారుడికి స్వల్ప అస్వస్థత.. అధికారులపై మంత్రి ఆగ్రహం

ఈ దాడులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కక్ష సాధింపు ధోరణితోనే దాడులు చేస్తున్నారని..తన కుమారుడిని అధికారులు ఇబ్బందులకు గురిచేసారని అందుకే అస్వస్థతకు గురి అయ్యారని అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాగా..ఈ ఐటీ దాడులు కొనసాగుతున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయన్ను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. కొడుకు ఆస్పత్రిలో ఉండటంతో పరామర్శించేందుకు తన నివాసం నుంచి బయలుదేరిన మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. మల్లారెడ్డి వారిని ఆస్పత్రికి వెళ్లి కొడుకును పరామర్శించి వస్తానని కోరినప్పటికీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఐటీ అధికారుల తీరుపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

IT Raids On Malla Reddy : తలుపులు బద్దలు కొట్టి మరీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

ఐటీ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఇది రాజకీయ కక్ష సాధింపే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, 200 మంది అధికారులను మా ఇళ్లపైకి పంపి దౌర్జన్యం చేస్తున్నారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేమైనా దొంగ వ్యాపారం చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. రాతంత్రా నా కుమారుడిని ఇబ్బంది పెట్టారని, నా కుమారుడిని కొట్టారు అంటూ ఐటీ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి మల్లారెడ్డి..

Malla Reddy IT Raids : కట్టల కట్టల డబ్బు.. మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కోట్ల రూపాయల నగదు సీజ్