IT Raids On Malla Reddy : తలుపులు బద్దలు కొట్టి మరీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

మంత్రి మల్లారెడ్డికి అల్లుడు వరుసయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు ఐటీ అధికారులు. అయితే, అధికారులను చూసిన సంతోష్ రెడ్డి ఇంటికి తాళం వేశారు. దీంతో ఇంటి తలుపులు పగలగొట్టి మరీ ఇంట్లోకి వెళ్లారు ఐటీ అధికారులు.

IT Raids On Malla Reddy : తలుపులు బద్దలు కొట్టి మరీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

IT Raids On Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మంత్రి నివాసం, కార్యాలయాలతో పాటు.. ఆయన కుమారులు, అల్లుడు, బంధువులు, సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లోనూ సోదాలు చేపట్టాయి ఐటీ టీమ్స్. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి.. కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి.

కాగా, మంత్రి మల్లారెడ్డికి అల్లుడు వరుసయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు ఐటీ అధికారులు. అయితే, అధికారులను చూసిన సంతోష్ రెడ్డి ఇంటికి తాళం వేశారు. దీంతో ఇంటి తలుపులు పగలగొట్టి మరీ ఇంట్లోకి వెళ్లారు ఐటీ అధికారులు. మంగళవారం మధ్యాహ్నాం 3గంటలకు ఐటీ అధికారులు సంతోష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మల్లారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సంతోష్ రెడ్డి.. మంత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూస్తున్నారు.

కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు, విచారణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరుస దాడులతో టీఆర్ఎస్ నేతల్లో అలజడి మొదలైంది. తాజాగా మంత్రి మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడు, వియ్యంకుడు, బంధువులు, సన్నిహితులు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. దాదాపు 50 బృందాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మల్లారెడ్డికి వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక యూనివర్సిటీ, 38 ఇంజినీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల నగదు లావాదేవీలు బాలానగర్ లో ఉన్న క్రాంతి బ్యాంక్ లో జరిగినట్టుగా ఐటీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వరరావును కూడా ప్రశ్నించారు. రెండు రోజుల పాటు ఐటీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు ఏకంగా రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఐటీ అధికారులు ఈ ఉదయం నుంచే త్రిశూల్ రెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు. మల్లారెడ్డి బాటలోనే త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నిర్వహిస్తున్నారు.

మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు అక్కడా రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.