కరోనా భయంకరమైన వ్యాధి కాదు, పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది-సీఎం జగన్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా

  • Publish Date - March 15, 2020 / 09:36 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా భయపడాల్సిన పని లేదన్నారు. కరోనా వల్ల మనుషులు చనిపోతారన్నది కరెక్ట్ కాదని జగన్ అన్నారు. కరోనా వల్ల మనుషులు చనిపోతున్నారని ప్రచారం జరగుతోందన్నారు. కరోనా వైరస్ కి మందు(మెడికేషన్) పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్పిన సీఎం జగన్.. ఆ ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుందన్నారు. ఆదివారం(మార్చి 15,2020) మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సీఎం జగన్ కరోనా పై కీలక వ్యాఖ్యలు చేవారు. 

కరోనా వైరస్ సోకిన వారిలో 60 ఏళ్లు పైబడినవారే చనిపోతున్నారని జగన్ గుర్తు చేశారు. బీపీ, గుండె, లివర్, ఆస్తమా, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారిపై వైరస్ ప్రభావం ఎక్కువ అని చెప్పారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ సోకితే ప్రమాదంగా మారుతుందన్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో 80శాతం వరకు ఇంట్లోనే నయమవుతున్నాయని చెప్పారు. టైఫాయిడ్, న్యూమోనియా తరహాలోనే కరోనాకి మెడికేషన్ కూడా పారాసిటమాలే అని సీఎం జగన్ చెప్పారు.

ఇంత మాత్రం దానికే ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదన్నారు సీఎం జగన్. కరోనా వైరస్ భయంకరమైనది కాదన్న సీఎం జగన్, ఇంట్లోనే ఉంటూ కరోనా నుంచి రికవరీ కావొచ్చని చెప్పారు. కరోనా కారణంగా ఏపీ ప్రజలు చింతించాల్సిన అవసరం లేదన్నారు సీఎం జగన్. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్ వివరించారు.

* కరోనా భయంకరమైన వ్యాధి కాదు
* కరోనా వల్ల చనిపోతారన్నది కరెక్ట్ కాదు
* కరోనా వైరస్ కి మందు(మెడికేషన్) పారాసిటమాల్
* కరోనా వల్ల మనుషులు చనిపోతారన్న భయానక పరిస్థితి సృష్టించడం కరెక్ట్ కాదు
* 60 ఏళ్లు పైబడిన వారిపైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది
* బీపీ, షుగర్, ఆస్తమా, గుండె, లివర్ సమస్యలు ఉన్నవారికి కరోనా వైరస్ ప్రమాదంగా మారుతోంది

* ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో 81శాతం మంది ఇంట్లోనే ఉండి రికవరీ అవుతున్నారు
* 13.08 శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు
* 4.7 శాతం మాత్రమే కరోనా క్రిటికల్ కేసులు ఉన్నాయి, ఐసీయూలో పెట్టి వైద్యం అందిస్తున్నారు
* కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదు