నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. స్టైఫండ్ భారీగా పెంచారు. ఇప్పుడు ఇస్తున్న స్టైఫండ్ ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని

  • Publish Date - December 20, 2019 / 03:09 PM IST

నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. స్టైఫండ్ భారీగా పెంచారు. ఇప్పుడు ఇస్తున్న స్టైఫండ్ ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని

నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. స్టైఫండ్ భారీగా పెంచారు. ఇప్పుడు ఇస్తున్న స్టైఫండ్ ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో శిక్షణ పొందే విద్యార్థులకు మాత్రమే ఈ పెంపుదల వర్తిస్తుంది. నర్సింగ్ విద్యార్థుల శిక్షణా కాలం మూడేళ్లు. 4వ ఏడాదిలో ఇంటర్న్ షిప్ ఇస్తారు. ఇంటర్న్ షిప్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఉపకార వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. 

ఇకపై ఫస్టియర్ విద్యార్థులకు రూ.3వేలు, సెకండియర్ 3వేల 500, థర్డియర్ 4వేలు, ఫోర్త్ ఇయర్ లేదా ఇంటర్న్ షిప్ కాలానికి రూ.4వేల 500 ప్రభుత్వం చెల్లించనుంది. కాగా, గతంలో ఫస్టియర్ విద్యార్థులకు రూ. 1500, రెండో ఏడాది 1700, మూడో ఏడాది 1900, ఫోర్త్ ఇయర్ లో రూ.2,200 ఉపకార వేతనాలు అందుతున్నాయి. జగన్ ప్రభుత్వం దీన్ని రెట్టింపు చేసింది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల ఉపకార వేతనాలను చివరిసారిగా 2010లో సవరించారు. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ప్రభుత్వం నర్సింగ్ విద్యార్థుల ఉపకార వేతనాలను స్వల్పంగా పెంచింది. అప్పటి నుంచి ఉపకార వేతనాలను పెంచాలనే డిమాండ్ ఉంది. వాటిని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం స్టైఫండ్ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల నర్సింగ్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.