Goutham Reddy: గౌతమ్ రెడ్డి అంత్యక్రియల బాధ్యతలు మంత్రులకు అప్పగించిన సీఎం జగన్
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు(23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని నిర్ణయించా
- vamsi
- Published On : February 22, 2022 / 09:46 AM IST
Mekapati (1)
Goutham Reddy: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు(23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని నిర్ణయించారు మేకపాటి కుటుంబ సభ్యులు. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియల నిర్వహణ సమన్వయకర్తగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను సీఎం జగన్ నియమించారు. అదేవిధంగా జిల్లా మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను లోకల్‌గా ఏర్పాట్లు చూడవల్సిందిగా ఆదేశించారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్ రెడ్డి పార్ధివ దేహం నెల్లూరుకు రానుంది.
ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్ రెడ్డి మృతదేహం ఉదయం 10.15 గంటలకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుందని, ఆ తర్వాత నెల్లూరులోని గౌతమ్ రెడ్డి నివాసానికి భౌతిక కాయం చేరుకుంటుందన్నారు. అక్కడే ప్రజలు, మేకపాటి అభిమానుల సందర్శనార్ధం భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు సురేశ్ చెప్పారు. రేపు ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని.. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ కూడా హాజరు కానున్నారు.
