CM Jagan in Tirumala: శ్రీవారి సేవలో సీఎం జగన్.. SVBC కన్నడ, హిందీ చానళ్లు ప్రారంభం

తిరుమలలో ఉన్న సీఎం జగన్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. SVBC హిందీ, కన్నడ చానళ్లు ప్రారంభించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిమిత్తం.. తిరుమలలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ఉత్సవాల్లో స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవాళ.. స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్, ఈవో స్వాగతం పలికారు.ధ్వజ స్తంభానికి నమస్కరించి లోనికి వెళ్లిన సీఎం.. బియ్యంతో స్వామివారికి తులాభారం సమర్పించారు. స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం.. అర్చకుల నుంచి ఆశీర్వచనం పొందారు. తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

అనంతరం.. ముఖ్యమంత్రి జగన్ ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించారు. వాటి లోగోలు ఆవిష్కరించారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన రెండో బూందీ పోటును ప్రారంభించారు. కాసేపట్లో.. టీటీడీ గో ఆధారిత పంటల కొనుగోలు అంశంపై.. రైతులతో ఎంఓయూ కార్యక్రమానికి హాజరవుతారు. అన్నమయ్య భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

ముఖ్యమంత్రి జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, నారాయణ స్వామి, అనిల్, గౌతమ్ రెడ్డి, వేణుగోపాల్, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు.. ఉన్నతాధికారులు ఉన్నారు.

Read More: CM Jagan : తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ట్రెండింగ్ వార్తలు