CM Jagan : తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో పా

CM Jagan : తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

Cm Jagan

CM Jagan Tirumala : ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జగన్ తిరుపతి చేరుకున్నారు. నేరుగా బర్డ్‌ ఆసుపత్రికి వెళ్లి కొత్తగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తిరుమల కొండపైకి చేరుకున్నారు.

సంప్రదాయ దుస్తులు ధరించి పట్టువస్త్రాలను మోసుకెళ్లి స్వామివారికి సమర్పించారు జగన్. ఆయన వెంట దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి ఉన్నారు. సోమవారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్న సీఎం జగన్‌.. మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

UPSC : బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తుకు రేపే లాస్ట్

టీటీడీ ముద్రించిన 2022 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను జగన్ ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు ల‌క్ష‌, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇత‌ర ప్రాంతాల్లోని టీటీడీ స‌మాచార కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంచుతారు.

AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే సీఎం జగన్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.