Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ అన్ని కోట్లా? చిరు కార్స్ కలెక్షన్..

(Chiranjeevi) నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ అన్ని కోట్లా? చిరు కార్స్ కలెక్షన్..

Chiranjeevi

Updated On : August 22, 2025 / 2:03 PM IST

Chiranjeevi : నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరు తన ఫ్యామిలీతో బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకోడానికి గోవాకి వెళ్లారు. ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి.(Chiranjeevi)

GQ 2022 సర్వ్ ప్రకారం చిరంజీవి ఆస్తుల విలువ అప్పటికి 1650 కోట్లు అని సమాచారం. సినిమాలు మాత్రమే కాకుండా, యాడ్స్, పలు రంగాల్లో పెట్టుబడులతో చిరంజీవి సంపాదిస్తున్నారు. చిరంజీవికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విశాలమైన ఇల్లు ఉంది. దీని వ్యాల్యూ అప్పటి లెక్కల ప్రకారం 28 కోట్లు అని సమాచారం. అలాగే చిరంజీవికి బెంగుళూరులో పెద్ద ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. పండగలకు చిరు ఫ్యామిలీ అక్కడికి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటారు.

Also See : Mega 157 Title Launch event : చిరంజీవి – అనిల్ రావిపూడి టైటిల్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

చిరు దగ్గర కార్స్ కలెక్షన్స్ కూడా భారీగానే ఉంది. చిరు దగ్గర ఉన్న ఖరీదైన కార్లలో 9 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్, 1.2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారు, 2.5 కోట్ల విలువైన బెంజ్ కారు, 90 లక్షల విలువైన టయోటా ల్యాండ్ క్రూజర్ కారు ఉన్నాయి. ఇవే కాకుండా మరి కొన్ని కార్లు కూడా ఉన్నాయి. అలాగే చిరంజీవికి ప్రైవేట్ జెట్ విమానం కూడా ఉందని ఒక రూమర్ ఉంది. కోకాపేటలో చిరంజీవికి వందల కోట్ల విలువ చేసే భూమి ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం చిరు స్వయంగా పలు సందర్భాల్లో తెలిపారు. గతంలో అక్కడ కొన్ని ఎకరాలు వాళ్ళ చెల్లిళ్లకు రాఖీ సందర్భంగా గిఫ్ట్ ఇచ్చారు.

ఇవి కేవలం చిరంజీవి ఆస్తులు, చిరు కార్లు మాత్రమే. రామ్ చరణ్ తో సహా చిరంజీవి ఫ్యామిలీ, పిల్లలకు ఎవరికీ వాళ్లకు సపరేట్ ఆస్తులు ఉన్నాయి. చిరు ఫ్యామిలీలో అందరూ మంచి హోదాలో ఉండి బాగా సంపాదిస్తున్నవారే.

Also Read : Chiranjeevi Birthday : గోవాలో చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ స్పెషల్ పోస్ట్.. వీడియో వైరల్..