Samsung Galaxy S25 5G : అమెజాన్‌లో మాస్ డీల్.. ఈ శాంసంగ్ S25 5Gపై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడు మీ బడ్జెట్ రేంజ్‌లోనే..!
Samsung Galaxy S25 5G : శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ ధర తగ్గింది. అమెజాన్‌లో అసలు ధర నుంచి రూ. 19,819 తగ్గింపు పొందింది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S25 5G
Samsung Galaxy S25 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన కెమెరా ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 5జీ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర దాదాపు రూ.80,999 ఉండగా, అమెజాన్‌లో కస్టమర్‌లు దాదాపు రూ.60వేల ధరకు పొందవచ్చు.
ఈ అదిరే డీల్ పొందాలంటే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను (Samsung Galaxy S25 5G) ఎంచుకోండి. తద్వారా అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. ట్రిపుల్ కెమెరా, ఆకర్షణీయమైన స్పెషిఫికేషన్లను కలిగి ఉంది. ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 ధర లాంచ్ ధర కన్నా రూ.62,680 తక్కువ. ఆసక్తిగల కస్టమర్లు IDFC, OneCard లేదా ఇతరుల బ్యాంక్ కార్డులతో అదనంగా రూ.1,500 తగ్గింపును పొందవచ్చు. అసలు ధర దాదాపు రూ.61వేలకి తగ్గుతుంది. అదనంగా, కస్టమర్లు నెలకు రూ.3,039 నుంచి ఈఎంఐ ఆప్షన్లతో కూడా ఎంచుకోవచ్చు.
అమెజాన్ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆప్షన్ కూడా అందిస్తుంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 58వేల వరకు పొందవచ్చు. అయితే, వర్కింగ్ కండిషన్, ఇతర కండిషన్లపై ఆధారపడి ఉంటుంది. ఆసక్తిగ కొనుగోలుదారులు అదనంగా చెల్లిస్తే ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్ వంటి విభిన్న యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 6.2-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ విషయానికి వస్తే.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 4,000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ OISతో కూడిన 50MP బ్యాక్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో లెన్స్ నేతృత్వంలోని ట్రిపుల్ లెన్స్ సెటప్ అందిస్తుంది.
